సింగరేణి ప్రైవేటీకరణకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది : వివేక్ వెంకటస్వామి

 సింగరేణి ప్రైవేటీకరణకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది : వివేక్ వెంకటస్వామి

బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  సింగరేణి సంస్థ ప్రైవేటీకరణకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియా కేకే ఓసీపీలో పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ తరుపున ఐఎన్టీయూసీ ఆధ్వర్యం లో నిర్వహించిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు.  సంస్థకు కొత్త గనులు తీసుకొ స్తామన్నారు. కార్మికులకు ఐటీ, సొంతింటి కల సాకారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

 ఆర్ ఎఫ్సీఎల్ రీ ఓపెన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 10వేల కోట్ల రుణ మాఫీ చేయించి తెరిపించానని చెప్పారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తదన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు, నల్ల ధనం వెనక్కి తీసుకొచ్చి పేద వాడి బ్యాంక్ ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని చెప్పి బీజేపీ విస్మరించిందని ఆరోపించారు. కేసీఆర్ కు వ్యతిరేఖంగా పనిచేస్తే తనపై కక్ష్య కట్టి పటాన్ చెరులోని ఫ్యాక్టరీనీ మూసేశారని ఆయన ఆరోపించారు.