Star Kids: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన స్టార్ కిడ్స్.. ఆనందంలో హీరోలు

Star Kids: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన స్టార్ కిడ్స్.. ఆనందంలో హీరోలు

సాధారణంగా స్టార్ కిడ్స్ అంటే అందరూ ఒకటే అనుకుంటారు.. వాళ్లకి చదువుపై ఇంట్రెస్ట్ ఉండదని, దేశ విదేశాలు తిరుగుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారని, అసలు వాళ్లకి బాగా చదువుకోవాల్సిన అవసరం కూడా లేదని అనుకుంటారు. కానీ, స్టార్స్ పిల్లలు కూడా బాగా చదువుతారని, వాళ్ళు కూడా మంచి మార్కులు తెచుకుంటారని, ర్యాంక్స్ కొడతారని మీకు తెలుసా. ఇదే విషయాన్నీ తమిళ స్టార్ హీరోల పిల్లలు ప్రూవ్ చేశారు. అవును.. ఇటీవల తమిళనాడు ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. 

ఈ ఫలితాల్లో తమిళ స్టార్ హీరోల పిల్లలు ఫస్ట్ క్లాస్ మార్కులను సాధించారు. వారిలో ధనుష్ కుమారుడు, సూర్య కుమార్తె ఉన్నారు. హీరో ధనుష్‌ పెద్ద కుమారుడు యాత్ర ఇటీవలే ఇంటర్ సెకాండ్ ఇయర్ పరీక్షలు రాసాడు. ఈ పరీక్షల్లో 600 మార్కులకు గాను 569 మార్కులు సాధించాడు  యాత్ర. ఇక మరో స్టార్ హీరో సూర్య కూతురు దియా కూడా మంచి మార్కులు సాధించారు. ఐటీవల 12వ తరగతి పరీక్షలు రాసిన ఆమె.. ఆ పరీక్షల్లో 600 మార్కులకు గాను.. 581 మార్కులు సాధించి అందరి దృష్తని ఆకర్షించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సూర్య కంగువ సినిమా చేస్తున్నారు. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో 3D టెక్నాలజీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ధనుష్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన రాయన్ సినిమా చేస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు స్వయంగా ధనుష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.