కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు.. 

కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు.. 

లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీమ్ కోర్ట్. జూన్ 1వరకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో సార్వత్రిక ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు ఊరట లభించిందని చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కూడా అనుమతిస్తూ సుప్రీమ్ కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేయగా కేజ్రీవాల్ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఇవాళ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.

అయితే, జూన్ 2న మళ్ళి కోర్టులో సరెండర్ కావాలని ఆదేశించింది కోర్టు.కాగా, కేజ్రీవాల్ జూన్ 5వరకు బెయిల్ ఇవ్వాలని కోరారు. కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభ్యర్థనను తిరస్కరించింది ధర్మాసనం.లిక్కర్ కేసు గురుంచి ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ మాట్లాడొద్దని  ఈడి తరపు న్యాయవాది కోర్టును కోరగా,అంతకంటే గట్టిగ కౌంటర్ ఇవ్వాలని ఈడీకి సూచించింది ధర్మాసనం.కేజ్రీవాల్ అరెస్ట్ అయిన 50రోజుల తర్వాత బెయిల్ మంజూరైంది. దీంతో ఆప్ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. సుప్రీమ్ నిర్ణయం పట్ల ఢిల్లీ మేయర్ హర్షం వ్యక్తం చేశారు.