కదులుతున్న రైలు ఎక్కబోయిన తల్లీ, కొడుకు

కదులుతున్న రైలు ఎక్కబోయిన తల్లీ, కొడుకు

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారి అప్రమత్తతతో పశ్చిమ బెంగాల్‌లోని బంకురా రైల్వే స్టేషన్‌లో ఒక వృద్ధ మహిళ, ఆమె కొడుకు ప్రాణాలు నిలబడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై స్పందించిన మంత్రిత్వ శాఖ కూడా RPF సిబ్బందిని ప్రశంసించింది. ఇక వివరాల్లోకి వెళితే..  రైల్వే స్టేషన్ నుండి రైలు బయలుదేరడంతో.. దానిని పట్టుకోవడానికి ప్రజలు పరుగులు తీస్తుండడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. ఈ సమయంలోనే  ఓ వృద్ధ మహిళ, ఆమె కొడుకు కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన మహిళా RPF అధికారి వెంటనే అలర్ట్ అయ్యి... ఆ ఇద్దరిని చేరుకోవడానికి పరుగెత్తారు. 

కొన్ని సెకన్ల తర్వాత, మహిళ, ఆమె కుమారుడు ప్లాట్‌ఫారమ్‌పై జారిపడి కింద పడిపోవడంతో... వెంటనే అక్కడికి చేరుకున్న RPF అధికారి ప్రమాదాన్ని పసిగట్టి.. వారి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంలోనే ప్రయాణికులు కదులుతున్న రైలును ఎక్కడం లేదా దిగడం చేయకూడదని రైల్వే మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. దీంతో నెటిజన్లు RPF అధికారి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.