రైల్వేలో 52 వారాలు.. 52 సంస్కరణలు : రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్

రైల్వేలో 52 వారాలు.. 52 సంస్కరణలు : రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే శాఖ పనితీరుపై రైల్వే భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైల్వేలో ప్రధాన సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించారు. 52 వారాల్లో 52 సంస్కరణలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టు కున్నారు. రైల్వేల సామర్థ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు గవర్నెన్స్, సర్వీస్ డెలివరీలో ఈ సంస్కరణలు చేపట్టాలని యోచిస్తున్నారు. 

ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించ డంతో రైల్వేలో ప్రమాదాలు 90శాతా నికి తగ్గాయని అధికారులు తెలిపారు. రైల్వేలో ప్రమాదాలు 2014-15లో 135గా నమోదైతే.. 2025-26 నాటికి 11కు తగ్గాయని చెప్పారు. ప్రమా దాల సంఖ్యను సింగిల్ డిజిట్ కే తగ్గిం చడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.