తమిళనాడు హంగ్ పాలిటిక్స్: విజయ్కు సపోర్ట్ చేయం.. తేల్చి చెప్పిన అన్నాడీఎంకే !

తమిళనాడు హంగ్ పాలిటిక్స్: విజయ్కు సపోర్ట్ చేయం.. తేల్చి చెప్పిన అన్నాడీఎంకే !

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికర పరిణామాలకు దారితీశాయి. తమిళనాడులో అనూహ్యంగా విజయ్ టీవీకే పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే.. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118. 

విజయ్ జోసెఫ్ టీవీకే పార్టీ 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తుది ఫలితాల తర్వాత కూడా ఇంతకు మించి విజయ్ పార్టీ గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. అంటే.. విజయ్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలంటే ఇంకా 8 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి.

విజయ్కు ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇచ్చేది లేదని అన్నాడీఎంకే పార్టీ ఇప్పటికే ప్రకటించింది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విజయ్ తండ్రి ప్రకటించారని జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. తుది ఫలితాలు వెల్లడయ్యే వరకూ ఎలాంటి ప్రకటన చేయకూడదని విజయ్ టీవీకే పార్టీ ఫలితాలను నిశితంగా గమనిస్తుంది.

ఇక.. విజయ్ పార్టీ ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం తమిళనాడు యువత. అవును.. తమిళనాడు యువత విజయ్ మేనిఫెస్టోలోని అంశాలకు ఆకర్షితులయ్యారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నా్యి. 29 ఏండ్లు నిండిన నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.4 వేలు, డిప్లొమా హోల్డర్లకు రూ.2,500 చొప్పున ‘యూత్ వెల్ఫేర్ ఫండ్’ కింద ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. 12వ తరగతి నుంచి పీహెచ్‌‌డీ వరకు విద్యార్థులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ.20 లక్షల వరకు రుణం అందిస్తామని ప్రకటించారు.

‘త్రాట’ (టీఆర్ఏటీఏ) చట్టం ద్వారా ఏడాది పొడవునా పక్కాగా ఉద్యోగ క్యాలెండర్‌‌ను అమలు చేస్తామని చెప్పారు. అవినీతి లేని, ప్రజల కోసం నిలబడే అభ్యర్థులనే తాను ఎంపిక చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలందరూ తమకు ఒక అవకాశం ఇచ్చి, విజిల్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. విజయ్ ప్రకటించిన ఈ అంశాలు తమిళనాడు యువతను విజిల్ గుర్తుకు ఓటేసేలా చేశాయి.