వెస్ట్ బెంగాల్ కౌంటింగ్ లో ఉద్రిక్తత... టీఎంసీ ఆఫీసు దగ్ధం..పోలీసుల లాఠీఛార్జ్..

వెస్ట్ బెంగాల్ కౌంటింగ్ లో ఉద్రిక్తత... టీఎంసీ ఆఫీసు దగ్ధం..పోలీసుల లాఠీఛార్జ్..

వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉద్రిక్తతకు దారి తీసింది. బీజేపీ ఆధిక్యంలో ఉన్న సమయంలో అల్లర్లు చెలరేగాయి. బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరడంతో టీఎంసీ ఆఫీసుకు నిప్పు పెట్టారు. అసన్‌సోల్. దిన్‌హటాలోని కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఘర్షణలు జరిగినట్లు సమాచారం. అసన్‌సోల్ ఇంజనీరింగ్ కళాశాల కౌంటింగ్ కేంద్రంలో పోలింగ్ ఏజెంట్ల మధ్య జరిగిన చిన్న తోపులాట పెద్ద ఘర్షణగా మారింది.

కౌంటింగ్ కేంద్రంలోని కుర్చీలు విరగ్గొట్టి వాహనాలు ధ్వంసం చేయడంతో గందరగోళానికి దారి తీసింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుక లాఠీచార్జి చేశారు పోలీసులు. ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు.