దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు అసెంబ్లీల ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తమిళనాడులో టీవీకే, వెస్ట్ బెంగాల్ లో బీజేపీ, అస్సాం,పుదుచ్చేరిలో బీజేపీ, కేరళలో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది.
వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్:
200 మార్క్ దాటిన బీజేపీ
202 సీట్ల ఆధిక్యంలో బీజేపీ
85సీట్లకు పడిపోయిన టీఎంసీ
తమిళనాడు రిజల్ట్స్:
తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి విజయం.
ఎడప్పాడిలో 90 వేలకు పైగా ఓట్లతో గెలుపొందిన పళనిస్వామి.
ఢిల్లీలో బీజేపీ సంబరాలు:
అస్సాం, వెస్ట్ బెంగాల్ లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో దేశ రాజధాని ఢిల్లీ సంబరాలు అంబరాన్నంటాయి.
ఢిల్లీలోని బీజేపీ హెడ్డాఫీసులో ఝాల్మురి, రసగుల్లాలు పంచుకుంటూ సెలబ్రేట్ చేసుకున్న బీజేపీ శ్రేణులు.
తమిళనాడు రిజల్ట్స్:
ఉదయనిధి స్టాలిన్ విజయం
చెపాక్- తిరువల్లికేని నియోజకవర్గం నుండి గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్
టీవీకే అభ్యర్థి డీ. సెల్వంపై 54వేల 880 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్
తమిళనాడు రిజల్ట్స్:
తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుండి టీవీకే పార్టీ చీఫ్ విజయ్ విజయం..!
పోటీచేసిన రెండు స్థానాలలో ( తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ ) గెలుపొందిన విజయ్.
పుదుచ్ఛేరి ఫలితాలు :
ఆల్ ఇండియా ఎన్.ఆర్.కాంగ్రెస్ 11 ఆధిక్యం
బీజేపీ పార్టీ 4 స్థానాల్లో లీడ్
( ఆల్ ఇండియా ఎన్.ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమి )
డీఎంకే కూటమి 4 చోట్ల ఆధిక్యం
విజయ్ టీవీకే పార్టీ 3 స్థానాల్లో లీడ్
కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యం
ఎల్ జేకే పార్టీ ఒక చోట లీడ్
అన్నా డీఎంకే పార్టీ ఒక స్థానంలో ఆధిక్యం
ఎన్ వైఎంకే పార్టీ ఒక చోట లీడ్
స్వతంత్ర అభ్యర్థులు 3 చోట్ల ఆధిక్యం
తమిళనాడు రిజల్ట్స్:
మే 7న ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే సన్నాహాలు
118 సీట్ల మ్యాజిక్ ఫిగర్ కోసం వెయిటింగ్
ప్రస్తుతం 1 స్థానంలో గెలుపొంది..106 స్థానాల్లో లీడ్ లో ఉన్న టీవీకే
తమిళనాడు రిజల్ట్స్:
పెరంబూర్ నియోజకవర్గం నుండి టీవీకే పార్టీ చీఫ్ విజయ్ విజయం...!
డీఎంకే అభ్యర్థి ఆర్ డీ శేఖర్ పై ఇప్పటికే 31 వేల 766 ఓట్ల ఆధిక్యంలో విజయ్
తమిళనాడు రిజల్ట్స్:
విజయ్‌కు మద్దతు; చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటాం - గిరీష్ చోడంకర్
ఓట్ల లెక్కింపులో తేవగ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ, హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమిళనాడు విక్టరీ పార్టీకి మద్దతు ఇస్తారా అనే ప్రశ్నకు తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ గిరీష్ చోడంకర్ స్పందించారు. మహిళలు, యువత నుంచి అధిక సంఖ్యలో ఓట్లు రావడంతోనే తేవగ పార్టీ గెలిచిందని ఆయన అన్నారు. తమిళనాడులో తదుపరి చర్యలపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు .
తమిళనాడు రిజల్ట్స్ :
పార్టీల వారిగా ఇప్పటిదాకా పోలైన ఓట్లు:
విజయ్ టీవీకే పార్టీ సాధించిన ఓట్లు- 1.28 కోట్లు
డీఎంకే కూటమి సాధించిన ఓట్లు- 1.17 కోట్లు
ఒంటరిగా డీఎంకే సాధించిన ఓట్లు- 83 లక్షలు
ఏఐఏడీఎంకే కూటమి సాధించిన ఓట్లు- 1.08 కోట్లు
ఒంటరిగా ఏఐఏడీఎం సాధించిన ఓట్లు- 77 లక్షలు
తమిళనాడు రిజల్ట్స్ :
కొలత్తూరు నియోజకవర్గంలో సీఎం స్టాలిన్ ఓటమి. 9 వేల 122 ఓట్ల తేడాతో.. ప్రత్యర్థి, టీవీకే పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓటమి. తన రాజకీయ జీవితంలో రెండో ఓటమి కాగా.. సీఎంగా ఉండి ఫస్ట్ టైం ఓడిన స్టాలిన్. సీఎం స్టాలిన్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న డీఎంకే కార్యకర్తలు, నేతలు.
తమిళనాడు రిజల్ట్స్ :
డీఎంకే కూటమిలోని పార్టీలు పోటీ చేసిన సీట్లు.. ఆధిక్యం వివరాలు :
డీఎంకే పార్టీ 164 స్థానాల్లో పోటీ చేస్తే.. 58 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
కాంగ్రెస్ పార్టీ 28 స్థానాల్లో పోటీ చేస్తే.. 5 చోట్ల లీడ్ లో ఉంది.
వీకేసి 8 స్థానాల్లో పోటీ చేస్తే..2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
డీఎండీకే 10 స్థానాల్లో పోటీ చేసి.. ఒక స్థానంలో లీడ్ లో ఉంది.
5 స్థానాల్లో పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఇండియన్ యూనియన్ ముస్లిం పార్టీ రెండు స్థానాల్లో పోటీ చేస్తే... ఆ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
వెస్ట్ బెంగాల్ రిజల్ట్: 4:07 PM
మమతకు షాకిచ్చిన ఓటర్లు
191 సీట్లలో బీజేపీ ఆధిక్యం
టీఎంసీ 97 స్థానాల్లో లీడ్
లెఫ్ట్ పార్టీ 2, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యం
తమిళనాడు రిజల్ట్స్ 4:05 PM
అనూహ్యంగా పుంజుకున్న డీఎంకే పార్టీ
డీఎంకే పార్టీ 70 నియోజకవర్గాల్లో ఆధిక్యం
అన్నా డీఎంకే 59 చోట్ల మాత్రమే లీడ్
విజయ్ టీవీకే పార్టీ 105 స్థానాల్లో ఆధిక్యం
తమిళనాడు రిజల్ట్స్ : 3.57 PM
బిగ్ బ్రేకింగ్ :
తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
టీవీకే పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఘోర పరాచయం
కొలత్తూరు నియోజకవర్గం
వీఎస్ బాబు 80 వేల 453
స్టాలిన్ 71 వేల 336
9వెల 122 ఓట్లతో స్టాలిన్ ఓటమి
కాసేపట్లో సీఎం పదవికి రాజీనామా చేసే ఛాన్స్
తమిళనాడు ఫలితాలు : 3:45 PM
టీవీకే పార్టీ 105 సీట్లలో ఆధిక్యం
డీఎంకే పార్టీ 72 చోట్ల లీడ్
అన్నా డీఎంకే పార్టీ 57 స్థానాల్లో ఆధిక్యం
వెస్ట్ బెంగాల్ రిజల్ట్: 3:44 PM
మమతకు షాకిచ్చిన ఓటర్లు
196 సీట్లలో బీజేపీ ఆధిక్యం
టీఎంసీ 91 స్థానాల్లో లీడ్
లెఫ్ట్ పార్టీ 2, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యం
విజయ్ క్రేజ్.. PK స్ట్రాటజీ వెరసి తమిళనాట TVK సూపర్ విక్టరీ..
టీవీకే విజయంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర
CSKను ధోని గెలిపించినట్లు విజయ్ ను గెలిపిస్తానన్న PK
విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్, PK స్ట్రాటజీతో TVK విజయం
చెన్నైలోని పీకే ఆఫీసులో సంబరాలు
తమిళనాడు ఫలితాలు : 3.30 PM
కొత్తలూరు నియోజకవర్గంలో సీఎం స్టాలిన్ వెనకంజ. 15 రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత కూడా 7 వేల ఓట్ల వెనకంజలో ఉన్న స్టాలిన్. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబుకు 60 వేల 637 ఓట్లు రాగా.. స్టాలిన్ మాత్రం 7 వేల 74 ఓట్లతో వెనకబడి ఉన్నారు. స్టాలిన్ గెలుపు కష్టమే అంటూ వార్తలు.
తమిళనాడు రిజల్ట్స్ : 3.20 PM
అనూహ్యంగా పుంజుకున్న డీఎంకే పార్టీ
డీఎంకే పార్టీ 73 నియోజకవర్గాల్లో ఆధిక్యం
అన్నా డీఎంకే 54 చోట్ల మాత్రమే లీడ్
విజయ్ టీవీకే పార్టీ 107 స్థానాల్లో ఆధిక్యం
అన్నాడీఎంకే ఆధిక్యం తగ్గుతూ ఉండగా.. డీఎంకే లీడ్ పెరుగుతుంది
కేరళ ఫలితాలు: 3:20 PM
కేరళలో అధికారం దిశగా కాంగ్రెస్ కూటమి
మ్యాజిక్ ఫిగర్ దాటిన యూడీఎఫ్
యూడీఎఫ్ 101, ఎల్డీఎఫ్ 34 స్థానాల్లో ఆధిక్యం
తమిళనాడు ఫలితాలు : 3:20 PM
టీవీకే పార్టీ 105 సీట్లలో ఆధిక్యం
డీఎంకే పార్టీ 59 చోట్ల లీడ్
అన్నా డీఎంకే పార్టీ 70 స్థానాల్లో ఆధిక్యం
వెస్ట్ బెంగాల్ రిజల్ట్: 3:14 PM
మమతకు షాకిచ్చిన ఓటర్లు
191 సీట్లలో బీజేపీ ఆధిక్యం
టీఎంసీ 97 స్థానాల్లో లీడ్
లెఫ్ట్ పార్టీ 2, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యం
తమిళనాడు ఫలితాలు : 3:00 PM
టీవీకే పార్టీ 106 సీట్లలో ఆధిక్యం
డీఎంకే పార్టీ 67 చోట్ల లీడ్
అన్నా డీఎంకే పార్టీ 61 స్థానాల్లో ఆధిక్యం
కేరళ ఫలితాలు: 2:52PM
కేరళలో అధికారం దిశగా కాంగ్రెస్ కూటమి
మ్యాజిక్ ఫిగర్ దాటిన యూడీఎఫ్
యూడీఎఫ్ 99, ఎల్డీఎఫ్ 36 స్థానాల్లో ఆధిక్యం
వెస్ట్ బెంగాల్ రిజల్ట్: 2:42 PM
మమతకు షాకిచ్చిన ఓటర్లు
193 సీట్లలో బీజేపీ ఆధిక్యం
టీఎంసీ 95 స్థానాల్లో లీడ్
లెఫ్ట్ పార్టీ 2, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యం
తమిళనాడు ఫలితాలు : 2:40 PM
టీవీకే పార్టీ 108 సీట్లలో ఆధిక్యం
డీఎంకే పార్టీ 61 చోట్ల లీడ్
అన్నా డీఎంకే పార్టీ 65 స్థానాల్లో ఆధిక్యం
తమిళనాడు ఫలితాలు : 2.25 PM
డీఎంకే చీఫ్, సీఎం స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో వెనకంజలో ఉన్నారు. 13 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన సమయానికి స్టాలిన్ 8 వేల 455 ఓట్ల తేడాతో వెనకంజలో ఉన్నారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. స్టాలిన్ వెనకంజలో ఉండటం డీఎంకే పార్టీలో కలకలం.
వెస్ట్ బెంగాల్ రిజల్ట్
- మమతకు షాకిచ్చిన ఓటర్లు
- 195 సీట్లలో బీజేపీ ఆధిక్యం
- టీఎంసీ 93 స్థానాల్లో లీడ్
- లెఫ్ట్ పార్టీ 3, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యం
విజయ్ తండ్రి చంద్రశేఖర్ కామెంట్స్
- విజయ్ టీవీకే గెలుపు గర్వంగా ఉంది
- సీఎం అవుతానని విజయ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు
- ఒక్కశాతం కూడా డౌట్ లేదు
- పొత్తులకు వెళ్లకుండా సింగిల్ గా పోటీ చేశాడు
- ఇది చారిత్రాత్మక విజయం
- ప్రజలకు సేవ చేయాలనేది విజయ్ లక్ష్యం
- ఒక్కో అడుగు వేస్తూ ఇపుడు విజయం సాధించాడు
తమిళనాడులో ఆధిక్యంపై తీవ్ర ఉత్కంఠ : 1.42 PM
తమిళనాడు ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. రౌండ్ రౌండ్ ఓట్ల లెక్కింపు ఆధిక్యం దోబుచులాడుతోంది.దాదాపు100 నియోజకవర్గాల్లో ఆధిక్యం కేవలం 3 వేల ఓట్లు మాత్రమే ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో 100 నుంచి 500 ఓట్ల ఆధిక్యంలోనే ఉన్నారు అభ్యర్థులు.
తమిళనాడు ఫలితాలు : 1.40 PM
టీవీకే పార్టీ 104 సీట్లలో ఆధిక్యం
డీఎంకే పార్టీ 67 చోట్ల లీడ్
అన్నా డీఎంకే పార్టీ 63 స్థానాల్లో ఆధిక్యం
అనూహ్యంగా పుంజుకుంటున్న డీఎంకే పార్టీ. తగ్గుతున్న అన్నా డీఎంకే ఆధిక్యం
తమిళనాడులో ఓట్ షేరింగ్.. ఏపార్టీకి ఎంతంటే!
ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. విజయ్ టీవీకేపార్టీ13.13 శాతం ఓట్లతో అత్యధిక వాటాను దక్కించుకుంది.తర్వాతి స్థానాల్లో డీఎంకే 11.88 శాతం, ఏఐఏడీఎంకే 10.47 శాతంతో నిలిచాయి. నామ్ తమిళర్ కచ్చి 1.53 శాతం ఓట్లను పొందింది.
తమిళనాడులో ఎంకే స్టాలిన్ వెనకంజ..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఊహించని ఫలితాలు వస్తున్నాయి. అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ ఓడిపోతుంది. ఆ పార్టీ ముఖ్యనేతలంగా ఓటమి దిశగా పయనిస్తున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ప్రకారం.. విజయ్ టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో లీడ్ లో ఉంది. ఏఐడీఎంకే 72 స్థానాలతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. అధికార డీఎంకే కేవలం 51 స్థానాలకు పరిమితం అయ్యి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల ఫలితాల్లో కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ వెనకంజలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ - 10,639 ఓట్ల తేడాతో వెనుకబడ్డారు.
పుదుచ్చేరిలో తొలిఫలితం..తట్టంచవాడిలో రంగస్వామి గెలుపు
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వెలువడింది. తట్టంచవాడి నియోజకవర్గం సీఎం అబ్యర్థి, ఏఐఎన్‌ఆర్‌సి అభ్యర్థి ఎన్ రంగస్వామి విజయం సాధించారు. రంగస్వామి 4,441 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. రంగస్వామి10,024 ఓట్లు పోలవగా ఆయన సమీప ప్రత్యర్థి నేయం మక్కల్ కజగంకు చెందిన వినాయగం 5,583 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి కె. సేతుకు 3,984 ఓట్లు లభించాయి.
ఎన్ రంగస్వామి పుదుచ్చేరిలో సీనియర్ నేత. ఆయన మే 2021 నుంచి పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి సీఎంగా ఉన్నారు. రంగస్వామి గతంలో 2001 నుంచి 2008 వరకు , తిరిగి 2011 నుంచి 2016 వరకు సీఎంగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి నుంచి చీలిపోయి 2011లో ఏర్పడిన అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు.
మమతా బెనర్జీ కామెంట్స్
- ఇప్పటి వరకు 3 రౌండ్ల ఫలితాలే వచ్చాయి
- ఇంకా70 నియోజకవర్గాల ఫలితాలు ఈసీ వెల్లడించలేదు
- ఇంకా మనం ఓడిపోయినట్లు కాదు
- తుది ఫలితాలు మనవైపే ఉంటాయి
- కౌంటింగ్ కేంద్రాల నుంచి నేతలు వెళ్లకూడదు
- సర్ పేరుతో బీజేపీ ఓట్లను దొంగిలించింది
తమిళనాడు రిజల్ట్స్:12.30PM
ఎన్నికల సంఘం నుండి అధికారిక ప్రకటన
తమిళనాడు విజయ్ టీవీకే పార్టీ 105 స్థానాలు
ఏఐఏడీఎంకే కూటమి 72 స్థానాలు
డీఎంకే కూటమి 57 స్థానాల్లో ఆధిక్యం
కేరళలో కాంగ్రెస్ సంబరాలు
కేరళలో యూడీఎఫ్ (UDF) ప్రభంజనం సృష్టిస్తోంది. కూటమి 94 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో ఉండటంతో, దశాబ్ద కాలం తర్వాత కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు కావడం దాదాపు ఖాయమైంది. దీంతో కాంగ్రెస్ కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
విజయ్ సభలో తొక్కిసలాట జరిగిన.. కరూర్ సెగ్మెంట్ లో AIADMK ఆధిక్యం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొక్కిసలాట తర్వాత కరూర్ నియోజకవర్గం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కంపు ఫలితాల్లో ఓ పక్క విజయ్ టీవీకేపార్టీ విజయదుందుభి మోగిస్తుండగా.. తొక్కిసలాట జరిగి కరూర్ నియోజకవర్గంలో ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. కరూర్ సెగ్మెంట్ లో అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో డీఎంకే అభ్యర్థి త్యాగరాజన్ ఉంగా.. మూడో స్థానంలో విజయ్ పార్టీ టీవీకే అభ్యర్థఇ మతియళగన్ ఉండటం చర్చనీయాంశంగా మారింది.
బెంగాల్ లో బీజేపీ సంబరాలు
బెంగాల్ గడ్డపై బీజేపీ జెండా ఎగరబోతుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి అందిన ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ ఏకంగా 189 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బెంగాల్ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా.. మ్యాజిక్ ఫిగర్ 148ని సునాయాసంగా దాటేసి భారీ మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది. దీంతో కోల్‌కతా నుంచి జిల్లాల వరకు బీజేపీ కార్యాలయాల వద్ద పండగ వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు 'జై శ్రీరామ్' నినాదాలతో హోరెత్తిస్తున్నారు. రంగులు చల్లుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ విజయ గర్వంతో సంబరాలు జరుపుకుంటున్నారు.
తమిళనాడులో అనూహ్య ఫలితాలు.. సంబరాలు రద్దు చేసుకున్న డీఎంకే.. ఆఫీసు ముందు టెంట్లు తొలగింపు
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. పార్టీ స్థాపించిన రెండేళ్ళలో తమిళ వెట్రికజం(టీవీకే) పార్టీ సంచలనం సృష్టిస్తోంది. అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే ఊహించని పరిణామాలతో డీఎం కే వర్గాలు షాక్ తిన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని దాదాపు డీఏంకే నే తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేసినప్పటికీ అవి తారుమారు కావడంతో ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. పార్టీ గెలుస్తుందని సంబరాల జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న డీఏంకే వర్గాలు.. నిరాశపర్చే ఫలితాలతో వెనక్కితగ్గాయి. సంబరాలను రద్దు చేసుకుంది. డీఎంకే కార్యాలయంలో టెంట్లను తొలగించారు.
వెస్ట్ బెంగాల్(12:00గంటలు)
- 187 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
- 99 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యం
- బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సువేందు
- 180 సీట్లకు పైగా సాధిస్తామని ధీమా
తమిళనాడులో బీజేపీ వెనుకంజ
27 బీజేపీ పోటీ చేయగా కేవలం మూడుస్థానాల్లో ఆధిక్యం
కీలకనేతలందరూ వెనుకంజ
మైలాపూర్ లో తమిళిసై సౌందరరాజన్ వెనుకంజ
సత్తూరులో నైనార్ నాగేంద్రన్ కు ఎదురు దెబ్బ
అవినాశిలో మురగన్ ,కొయంబత్తూర్ నార్త్ లో వానతి శ్రీనివాసన్ వెనుకంజ
అస్సాం రిజల్ట్ (11:50)
- అస్సాంలో అధికారం దిశగా బీజేపీ
- 100 స్థానాల్లో బీజేపీ లీడ్
- కాంగ్రెస్ 24 స్థానాల్లో ఆధిక్యం
కేరళ (11:45)
- కేరళలో అధికారం దిశగా కాంగ్రెస్ కూటమి
- మ్యాజిక్ ఫిగర్ దాటిన యూడీఎఫ్
- యూడీఎఫ్ 93, ఎల్డీఎఫ్ 40 స్థానాల్లో ఆధిక్యం
- సీఎం పినరయి విజయన్ కు షాక్
- ధర్మడం నియోజకవర్గంలో వెనుకంజ
తమిళనాడు: 11.31AM
తమిళనాడులో అధికారం దిశగా విజయ్ టీవీకే పార్టీ
మ్యాజిక్ ఫిగర్ కు అతిచేరువలో టీవీకే
110 స్థానాల్లో టీవీకే ఆధిక్యం
విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత
వెస్ట్ బెంగాల్(11:30గంటలు)
- మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ
- 160 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
- 121 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యం
తమిళనాడు..
ఎగ్మోర్ నియోజకవర్గలో టీవీకే ఆధిక్యం
టీవీకే అభ్యర్థి రాజ్‌మోహన్ 10,760 ఓట్లతో ముందంజ
కోయంబత్తూరు సౌత్ లో సెంథిల్ బాలాజీ ఆధిక్యం
కేరళ (11:20)
- పినరయి విజయన్‌కు ఎదురుదెబ్బ: ధర్మడమ్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెనుకంజ
- కాంగ్రెస్ అభ్యర్థి వీపీ అబ్దుల్ రషీద్ చేతిలో వెనుకంజ
- యూడీఎఫ్ (UDF) ప్రభంజనం: కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ప్రస్తుతం 95 స్థానాల్లో ఆధిక్యం
- మ్యాజిక్ ఫిగర్ (71) దాటిన యూడీఎఫ్
- మంత్రుల వెనుకంజ: కేవలం ముఖ్యమంత్రే కాకుండా, దాదాపు 14 మంది మంత్రులు తమ నియోజకవర్గాల్లో వెనుకంజ
- ఎల్డీఎఫ్ (LDF) కుదేలు: వరుసగా మూడోసారి అధికారం చేపట్టాలని ఆశించిన ఎల్డీఎఫ్ కూటమి ప్రస్తుతం కేవలం 40-42 స్థానాలకే పరిమితం
తమిళనాడు రిజల్ట్స్ : 11.00 AM
ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన
తమిళనాడు టీవీకే పార్టీ 98 స్థానాలు,
ఏఐఏడీఎంకే కూటమి 68 స్థానాలు
డీఎంకే కూటమి 44 స్థానాల్లో ఆధిక్యం
కేరళ రిజల్ట్(11:00గంటలు)
- కేరళలో కాంగ్రెస్ కూటమి ముందంజ
- మ్యాజిక్ ఫిగర్ దాటిన కూటమి
- 97 స్థానాల్లో యూడీఎఫ్ కూటమి ఆధిక్యం
పశ్చిమ బెంగాల్ : భవానీపూర్ లో 2వ రౌండ్ ఓట్ల లెక్కింపు తర్వాత.. మమత బెనర్జీ వెనకంజ. 15 వందల 58 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి శువేందు ఆధిక్యం
తమిళనాడు :
తమిళనాడు:డిప్యూటీ సీఎం, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వెనకంజ
చెపాక్ -తిరువల్లికేనిలో వెనకంజలో ఉదయనిధి
టీవీకే అభ్యర్థి డిసెల్వం 3 వేల 700 ఓట్ల ఆధిక్యం
చెంగల్పట్టులోని 7 సెగ్మెంట్లలో 6స్థానాల్లో టీవీకే ముందంజ
తమిళనాడు :
కొలత్తూరు లో సీఎం స్టాలిన్ 4 వేల 100 ఓట్లతో వెనకంజ
ఇక్కడ విజయ్ పార్టీ టీవీకే అభ్యర్థి ముందంజ
వెస్ట్ బెంగాల్(10:45గంటలు)
- మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ
- 149 స్థానాల్లో ముందంజ
- టీఎంసీ 121 స్థానాల్లో లీడ్
- భవానీ పురంలో మమతా బెనర్జీ వెనుకంజ
- నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు ముందంజ
తమిళనాడు రిజల్ట్స్ :10.30AM
తమిళనాడు లో ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన
విజయ టీవీకే పార్టీ 83 స్థానాలు
ఏఐఏడీఎంకే కూటమి 63 స్థానాలు
డీఎంకే కూటమి 40 స్థానాల్లో ఆధిక్యం
ఇతరులు 1
కేరళ( 10:30గంటలు)
- కేరళలో 91 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యం
- ఎల్డీఎఫ్ 45 స్థానాల్లో లీడ్
- బీజేపీ 2, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యం
వెస్ట్ బెంగాల్ (10:30)
- బీజేపీ 141 స్థానాల్లో లీడ్
- టీఎంసీ 121 స్థానాల్లో లీడ్
- ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యం
- నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 667 ఓట్ల ఆధిక్యం
- భవానీ పురంలో ఆదిక్యంలో మమతా బెనర్జీ
తమిళనాడు 10.20AM
తమిళనాడులో అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకే
తొలి ట్రెండ్స్‌లో100 మార్కు దాటిన టీవీకే
టీవీకే100 స్థానాల్లో ఆధిక్యం
ఏఐఏడీఎంకే కూటమి 80 స్థానాల్లో ఆధిక్యం
డీఎంకే కూటమి 53 స్థానాల్లో ఆధిక్యం
తమిళనాడు: 10.18 AM
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ఆధిక్యం
విజయ్ ఇంటి ముందు భారీ బందోబస్తు
మోహరించిన పారామిలిటరీ, పోలీస్ బలగాలు
పశ్చిమ బెంగాల్ : 10.10 AM
భవానీపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీఎం మమత బెనర్జీ.. తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శువేందుపై 1,670 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫస్ట్ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి.
తమిళనాడు రిజల్ట్స్ :
కోలత్తూరు నియోజకవర్గం నుంచి సీఎం స్టాలిన్ 2 వేల ఓట్ల తేడాతో వెనకంజ
కోలత్తూరులో టీవీకే పార్టీ అభ్యర్థి ముందంజ
ఎడప్పాడిలో కె.పళనిస్వామి ఆధిక్యం
తమిళనాడు రిజల్ట్స్ : ఉదయం 10 గంటలకు ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కలు :
విజయ్ టీవీకే పార్టీ 62 నియోజకవర్గాల్లో ఆధిక్యం
అన్నా డీఎంకే, బీజేపీ కూటమి పార్టీ 51 సీట్లలో లీడ్
స్టాలిన్ డీఎంకే పార్టీ 27 స్థానాల్లో ఆధిక్యం
కాంగ్రెస్ పార్టీ 4 చోట్ల లీడ్
వెస్ట్ బెంగాల్ (ఉదయం 10 గంటల వరకు)
- బీజేపీ 150 స్థానాల్లో లీడ్
- టీఎంసీ 92 చోట్ల ఆధిక్యం
- కాంగ్రెస్ రెండుచోట్ల, ఇతరులు 2 చోట్ల ఆధిక్యం
తమిళనాడులో రిజల్ట్స్ : 10.00 AM
తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ హవా
80 స్థానాల్లో టీవీకే ఆధిక్యం, ఏఐడీఎంకే 58, డీఎంకే 44
మూడోస్థానంలో డీఎంకే పార్టీ
వెనకంజలో 31 మంది మంత్రులు
చెన్నైతోపాటు తిరునెల్వేలిలోని అన్ని నియోజకవర్గాల్లో టీవీకే ఆధిక్యం
పశ్చిమ బెంగాల్ : 9.55 AM
మమత టీఎంసీ పార్టీ 77 స్థానాల్లో ఆధిక్యం
బీజేపీ పార్టీ 85 సీట్లలో లీడ్ లో ఉంది
రెండు పార్టీ మధ్య ఆధిక్యం రౌండ్ రౌండ్ కు మారిపోతుంది.
ఫస్ట్ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత.. చాలా నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లతో అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
తమిళనాడు : చెన్నై సిటీ పరిధిలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి 14 చోట్ల డీఎంకే పార్టీ అభ్యర్థులు వెనకంజలో ఉన్నారు. 34 మంది మంత్రుల్లో 31 మంది వెనకంజలో ఉన్నారు.
కేరళ రాష్ట్రం : ధర్మడోం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీఎం వినరయి విజయ్ రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు తర్వాత వెనకంజలో ఉన్నారు. ఆయన కేబినెట్ లోని నలుగురు మంత్రులు సైతం వెనకంజలో ఉన్నారు.
పుదుచ్ఛేరి రిజల్ట్స్ : 9.30 AM
బీజేపీ కూటమి 7 స్థానాల్లో ఆధిక్యం
కాంగ్రెస్ కూటమి 3 సీట్లలో లీడ్
ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యం
కేరళ ఎన్నికల ఫలితాలు : 9.30 AM
కాంగ్రెస్ UDF కూటమి 78 సీట్లలో ఆధిక్యం
కమ్యూనిస్ట్ LDF పార్టీ 30 స్థానాల్లో లీడ్
బీజేపీ పార్టీ 12 సీట్లలో ఆధిక్యం
ఇతరులు 3 చోట్ల లీడ్ లో ఉన్నారు
అసోం ఎన్నికల ఫలితాలు : 9.30 AM
బీజేపీ 85 స్థానాల్లో ఆధిక్యంలో ఉంచి
కాంగ్రెస్ పార్టీ 25 చోట్ల లీడ్ లో ఉంది
పశ్చిమ బెంగాల్ రిజల్ట్స్ : 9.30 AM
బీజేపీ 129 స్థానాల్లో ఆధిక్యం
మమత టీఎంసీ పార్టీ 109 సీట్లలో లీడ్
కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది
కమ్యూనిస్ట్ పార్టీ లెఫ్ట్ ఒక స్థానంలో లీడ్
ఇతరులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు
తమిళనాడులో సంచలనం : 9.30 AM
విజయ్ టీవీకే పార్టీ 82 స్థానాల్లో ఆధిక్యం
స్టాలిన్ డీఎంకే పార్టీ 54 స్థానాల్లో లీడ్
బీజేపీ, అన్నా డీఎంకే పార్టీ 59 స్థానాల్లో ఆధిక్యం
ఆధిక్యంలో మూడో స్థానంలో ఉన్న డీఎంకే పార్టీ
- అసోంలో దూసుకుపోతున్న బీజేపీ
- జాలూక్ బారీ స్థానంలో హిమంత బిశ్వశర్మ ఆధిక్యం
- జోర్హాట్లో గౌరవ్ గొగొయ్ వెనుకంజ
- పుదుచ్చేరిలో ఎన్డీఏ హవా
- పోటీ చేసిన రెండు చోట్ల రంగస్వామి ఆధిక్యం
- యానాంలో మల్లాడి కృష్ణారావు ముందంజ
తమిళనాడు
- పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్ల విజయ్ ఆధిక్యం
- కొళత్తూరులో సీఎం స్టాలిన్ ముందజ
- చెపాక్‌లో డిప్యూటీ సీఎం ఉదయనిధి ఆధిక్యం
- మైలాపూర్‌లో తమిళిసై వెనుకంజ
- తిరుచ్చి వెస్ట్‌లో మంత్రి నెహ్రూ వెనుకంజ
- బోడినాయకనూర్‌లో పన్నీర్ సెల్వం లీడ్
- తమిళనాడులో పోస్టల్ బ్యాలె ట్ లో డీఎంకే వెనుకంజ
- మొదటి స్థానానికి దూసుకొచ్చిన టీవీకే
- కేరళ ఫలితాలు : మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి
- UDF ( కాంగ్రెస్ కూటమి ) 76 సీట్లలో ఆధిక్యం
- LDF ( కమ్యూనిస్టులు) 59 స్థానాల్లో లీడ్
- బీజేపీ పార్టీ కేవలం 4 స్థానాల్లో ఆధిక్యం
తమిళనాడు
- పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయ ముందంజ
- తమిళనాడులో రెండోస్థానంలో టీవీకే
- చెపాక్ లో ఉదయనిధి స్థాలిన్ లీడ్
- తమిమైలాపూర్ లో తమిళి సై వెనుకంజ
- తమిళనాడు తిరుచ్చిలో విజయ్ వెనుకంజ
- తమిళనాడు పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ముందంజ
- తమిళనాడులోని పెరంబూర్ లో టీవీకే అధినేత విజయ్ ఆధిక్యం
వెస్ట్ బెంగాల్
- నందిగ్రామ్ లో సువేందు అధికారి ముందంజ
- భవానీ పురంలో మమతా బెనర్జీ వెనకంజ, లీడ్ లో బీజేపీ నేత సువేందు అధికారి
- వెస్ట్ బెంగాల్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ హోరాహోరీ
- కేరళలో కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ ఆధిక్యం
- పశ్చిమ బెంగాల్: అధికార టీఎంసీ (TMC) బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది.
- తమిళనాడు: అధికార డీఎంకే (DMK) కూటమి, ఏఐఏడీఎంకే (AIADMK) ,నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) మధ్య త్రిముఖ పోటీ ఆసక్తి రేపుతోంది.
- కేరళ: అధికార ఎల్డీఎఫ్ (LDF) వరుసగా మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుండగా, యూడీఎఫ్ (UDF) గట్టి పోటీ ఇస్తోంది.
- అస్సాం: బీజేపీ వరుసగా మూడోసారి (హ్యాట్రిక్) విజయం సాధించాలని చూస్తోంది.
- పుదుచ్చేరి: NDA అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.
ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద మూడంచెల సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. సిబ్బంది కోసం ఈసారి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్లతో రూపొందించిన ఐడీ కార్డులను అందజేసింది. దీనివల్ల కేంద్రాల్లో గందరగోళానికి తావుండదని, ఇతరుల ఎంట్రీని అడ్డుకోవచ్చని పేర్కొంది.
ఒక్కో నియోజకవర్గానికి సుమారు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత 8:30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 8:00 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా.. 10 గంటల కల్లా తొలి ట్రెండ్స్ వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12:00 గంటలకు స్పష్టమైన ఆధిక్యతలు ఎవరివో తెలిసిపోతాయని, సాయంత్రం వరకు పూర్తి స్థాయి ఫలితాలు వెలువడుతాయని అధికారవర్గాలు తెలిపాయి.
బెంగాల్‌లో మొత్తం 294 సీట్లకు గానూ 293 చోట్ల కౌంటింగ్ జరగనుంది. ఫాల్తా నియోజకవర్గంలో ఏప్రిల్ 29 న పోలింగ్ సందర్భంగా పలు సెంటర్లలో హింస చోటుచేసుకుంది. కొన్ని కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వినిపించాయి. వివిధ పార్టీల అభ్యర్థుల ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ఫాల్తా నియోజకవర్గంలోని 15 పోలింగ్ బూత్‌లలో ఈ నెల 2 రీపోలింగ్ చేపట్టింది. రీపోలింగ్ సందర్భంగా మరోమారు హింస చెలరేగడంతో మొత్తం నియోజకవర్గంలో రీపోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఈ నెల 21న ఫాల్తాలో ఎన్నికల సంఘం అధికారులు మరోమారు పోలింగ్ చేపట్టనున్నారు.
కట్టుదిట్టమైన భద్రత.. సీసీ కెమెరాల నిఘా
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలక్షన్ కమిషన్ మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులను భారీగా మోహరించారు. ప్రతి కౌంటింగ్ హాల్‌లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, లెక్కింపు ప్రక్రియను లైవ్ రికార్డింగ్ చేస్తున్నారు. ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌లను తెరిచి, ప్రతి రౌండ్ ఫలితాన్ని అప్పటికప్పుడు డిక్లేర్ చేస్తారు. కౌంటింగ్ కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపులో పారదర్శకత కోసం వీవీప్యాట్ స్లిప్పుల వెరిఫికేషన్ కూడా కీలకం కానుంది.
రాష్ట్రాల వారీగా సీట్ల వివరాలు
బెంగాల్ లో మొత్తం 294 సీట్లు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 148 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లు ఉన్నాయి. ఇందులో 118 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 71 సీట్లను గెలుచుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. అస్సాం అసెంబ్లీలో 126 సీట్లు ఉండగా.. మెజారిటీ మార్క్ 64 సీట్లు గెలుచుకున్న పార్టీ రాష్ట్రంలో కొలువుతీరుతుంది. ఇక, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాలలో 16 సీట్లలో గెలుపొందిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
