రోహిత్ వచ్చేశాడు.. హార్థిక్ పాండ్యా లేడు.. లక్నోతో మ్యాచ్లో టాస్ గెలిచి.. బౌలింగ్ తీసుకున్న ముంబై

రోహిత్ వచ్చేశాడు.. హార్థిక్ పాండ్యా లేడు.. లక్నోతో మ్యాచ్లో టాస్ గెలిచి.. బౌలింగ్ తీసుకున్న ముంబై

లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై జట్టులో రెండు కీలక మార్పులు జరిగాయి. తొడ కండరాలు పట్టేయడంతో జట్టుకు దూరమైన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ లక్నో మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చేశాడు. బౌల్ట్ స్థానంలో కార్బిన్ బాష్ జట్టులోకి వచ్చాడు.

హార్థిక్ పాండ్యా ఈ మ్యాచ్లో లేకపోవడం ఆసక్తికర చర్చకు దారితీసింది. హార్థిక్ను కెప్టెన్సీ ఫెయిల్యూర్ కారణంగానే పక్కన పెట్టేశారని ముంబై ఇండియన్స్ అభిమానులు భావిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. 

ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బోష్, దీపక్ చాహర్, జస్ప్రిత్ బుమ్రా, ఘజన్ ఫర్, రఘు శర్మ

లక్నో సూపర్ జెయింట్స్: మిచ్చెల్ మార్ష్, మర్క్రమ్, రిషబ్ పంత్, జోస్ ఇంగ్లీస్, నికోలస్ పూరన్, రఘువంశీ, హిమ్మత్ సింగ్, మహ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, అవీష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్