హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం

హైదరాబాద్ లో మళ్లీ  భారీ వర్షం

హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. రెండు రోజులు గ్యాప్ ఇచ్చిన వర్షం మళ్లీ పడుతోంది.  జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, కూకట్ పల్లి, లింగంపల్లి, బాచుపల్లి, మియాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి మణికొండ, ఖైరతాబాద్, ఉప్పల్, అబిడ్స్, బషీర్ బాగ్, కోఠి, నారాయణగూడ, సికింద్రాబాద్, ఈసీఐఎల్, బోయిన్ పల్లి, బాల్ నగర్,జీడిమెట్ల,మేడ్చల్, కొంపల్లి, అల్వాల్, మారేడుపల్లి, నిజాంపేటర్, ప్రగతి నగర్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. 

భారీ వర్షం కారణంగా రోడ్లపైకి నీళ్లు రావడంతో  పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది.విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  హైదరాబాద్ లో మరో మూడు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.