గోవుల అక్రమ రవాణాను అరికట్టండి...డీజీపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ

గోవుల అక్రమ రవాణాను అరికట్టండి...డీజీపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ

గోషామహల్, వెలుగు: తెలంగాణలో గోవుల అక్రమ రవాణా ఘటనలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్​కు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్  బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో చట్టం అందరికీ సమానంగా అమలు కావాలని ఆయన డిమాండ్ చేశారు. గత శనివారం రాత్రి గోవులతో వెళ్తున్న ఓ లారీని గోరక్ష దళ్ కార్యకర్తలు అడ్డుకున్న ఘటనను రాజా సింగ్ లేఖలో ప్రస్తావించారు. 

ఆ సమయంలో అక్కడికి చేరుకున్న ఎంఐఎం నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఆ లారీని తీసుకువెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గోవుల అక్రమ రవాణా చేస్తున్న వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని, పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా విధులు నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు.