తెలంగాణ నుంచి ఒకే ఒక్కడు..దటీజ్ రాజన్నసిరిసిల్ల కలెక్టర్

తెలంగాణ నుంచి ఒకే ఒక్కడు..దటీజ్ రాజన్నసిరిసిల్ల కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కు అరుదైన అవకాశం లభించింది. ప్రధానమంత్రి అవార్డులకు సంబంధించిన సవరణలపై సలహాలు ఇచ్చే ప్యానెల్ లో కలెక్టర్ కు చోటు దక్కింది.  ప్రజా పరిపాలనలో అత్యున్నత ఫలితాలు చూపినందుకు అఖిల భారత సర్వీసు అధికారులకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఎక్సలెన్స్ అవార్డులను ప్రతి ఏటా సివిల్ సర్వీసెస్ దినోత్సవం రోజున ఇస్తుంది.

అయితే 2020 కు గానూ ప్రధాన మంత్రి అవార్డుల సంబంధించిన సవరణలపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 15 జిల్లాల కలెక్టర్లను సెలక్ట్ చేసింది. అందులో ఏపీ నుంచి విశాఖ కలెక్టర్, తెలంగాణ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కృష్ణ భాస్కర్ ను ఎంపిక చేసింది. ఈ నెల 28న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరింది . దీంతో గ్రామీణ అభివృద్ధి ,మౌలిక వసతుల కల్పన , విద్యాభివృద్ధి కి సంబంధించి ప్రధానమంత్రి అవార్డులలో చేపట్టాల్సిన సవరణలు ,సూచనలను పరిపాలన సంస్కరణలు,ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శికి జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్  విడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసారు.

see more news

బీజేపీలోకి బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

పెళ్లైన ఏడాది నుంచే టార్చర్.. నాకు న్యాయం చేయండి