అంబరాన్ని అంటుతున్న హోలీ సంబరాలు

అంబరాన్ని అంటుతున్న హోలీ సంబరాలు

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రజలు రంగుల్లో మునిగితేలుతున్నారు.చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుని  ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు.స్నేహితులు, సన్నిహితులు పాటలకు స్టెప్స్ వేస్తూ సందడి చేస్తున్నారు.అందరూ ఒక చోట చేరి కలర్ ఫుల్ రంగులను చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కరోనాతో రెండేళ్లు దూరంగా ఉన్న జనం తిరిగి సాధారణ పరిస్థితులు రావడంతో.. ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి రంగులు పూసుకుంటూ .. డ్యాన్సులు వేస్తూ... హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రెయిన్ డ్యాన్సులు, మడ్ డ్యాన్సులు లాంటి వెరిటీ ప్రోగ్రామ్ లతో ఈవెంట్లు నిర్వహిస్తున్నారు ఆర్గనైజర్లు.మొత్తానికి వసంతకాలాన్ని ఆహ్వానిస్తూ..చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు హోలీ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.

జేపీ నడ్డా నివాసం దగ్గర హోలీ సంబరాలు 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు డ్యాన్సులతో హోరెత్తించారు. రంగులు చల్లుతూ నడ్డాకు విషెస్ చెప్పారు. కలర్ ఫుల్ హోలీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రజలు.

ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్ కు హోలీయే నిదర్శనం

ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్ కు హోలీయే నిదర్శనమన్నారు కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. హోలీవేడుకల్లో భాగంగా డోలు వాయించారు కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. తన నివాసంలో ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఇవాళ షబ్-ఏ-బారాత్ పండుగ కూడా అని అన్నారు నఖ్వీ. అన్ని పండుగలు జరుపుకోవడమే.. మన దేశ గొప్పదమని అన్నారు నఖ్వీ.

యూపీలో ఘనంగా హోలీ వేడుకలు 

ఉత్తర ప్రదేశ్ లో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మధుర బృందావనంలోని బన్ కే బిహారీ ఆలయం వద్ద హోలీ వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి.హోలీ వేడుకల కోసం కృష్ణాలయం దగ్గరికి భారీ సంఖ్యలో జనం వచ్చారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకున్నారు. కృష్ణ భగవానుడి ఆలయం నుంచి వచ్చిన రంగుల కోసం జనం ఎగబడ్డారు. యూపీ రాజధాని లక్నోలోనూ ఘనంగా వేడుకలు జరిగాయి. రంగులతో యువత ఆడుకున్నారు. పలు హోలీ కార్యక్రమాలల్లో డ్యాన్సులు చేశారు యూత్.

 

జమ్మూకశ్మీర్ లో జవాన్ల హోలీ సంబరాలు 

జమ్మూకశ్మీర్ గజన్సూ ప్రాంతంలో బీఎస్ఎస్ జవాన్లు హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పాటలు పాడుతూ అదిరిపోయే స్టెప్పులు వేస్తూ నృత్యాలు చేస్తున్నారు. అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని  చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రంగులు గుప్పుకుంటున్నారు. 

రాజస్థాన్లో జవాన్ల హోలీ సంబరాలు 

రాజస్థాన్ లో బీఎస్ఎఫ్ జవాన్లు  సందడి చేశారు. హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. రంగుల చల్లుకుని పాటలు పాడుతూ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. 

అమృత్ సర్ లో జవాన్ల హోలీ వేడుకలు 

పంజాబ్ అమృత్ సర్ లోని 73వ బెటాలియన్ అజ్నాలా ప్రధాన కార్యాలయంలో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. జవాన్లు రంగులు చల్లుకుంటూ పాటలు పాడుతూ..డ్యాన్స్ లు చేస్తూ అందరూ కలిసికట్టుగా పండుగను జరుపుకుంటున్నారు. 

బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలు నిషేధం

హోలీ సందర్భంగా హైదరాబాద్ లో పలు ఆంక్షలు విధించారు పోలీసులు. బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలు నిషేధించారు. అపరిచుతలపై రంగులు వేయరాదన్నారు. భవనాలు, వాహనాలపై రంగులు పోయవద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రాష్ట్రంలో శుక్రవాహం మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్ లు మూసివేశారు. హోలీ సందర్భంగా శనివారం ఉదయం 6 గటల వరకు మద్యం అమ్మకాలు నిషేధించారు

మరిన్ని వార్తల కోసం

2022లో మొదటి తుపాన్‌‌‌‌‌‌‌‌ అసానీ

అస్సాం చాయ్ పత్తాకు జెలెన్ స్కీ పేరు