అస్సాం చాయ్ పత్తాకు జెలెన్ స్కీ పేరు

అస్సాం చాయ్ పత్తాకు జెలెన్ స్కీ పేరు

కోల్​కతా: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ బ్రాండ్ నేమ్ తో ఓ చాయ్ పత్తా మార్కెట్లోకి విడుదలైంది. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో అసమాన ధైర్యం చూపుతున్న జెలెన్ స్కీ గౌరవార్థం ఆయన పేరు మీదుగా.. జెలెన్ స్కీ బ్లాక్ టీ పౌడర్ ను అస్సాం స్టార్టప్ కంపెనీ అరోమిక్ టీ బుధవారం విడుదల చేసింది. ‘రియల్లీ స్ట్రాంగ్.. స్ట్రాంగ్ అస్సాం బ్లాక్ టీ’ అంటూ క్యాప్షన్స్ పెట్టింది. ఉక్రెయిన్ నుంచి సేఫ్​గా పారిపోయేందుకు సహాయం చేస్తామన్న అమెరికా ఆఫర్ ను తిరస్కరించినప్పుడే జెలెన్ స్కీ అద్భుతమైన క్యారెక్టర్ బయటపడిందని, అందుకే ఆయన పేరిట తాము ఓ బ్రాండ్ ను ప్రారంభించామని అరోమిక్ టీ డైరెక్టర్ రంజిత్ బారువా చెప్పారు.