2022లో మొదటి తుపాన్‌‌‌‌‌‌‌‌ అసానీ

2022లో మొదటి తుపాన్‌‌‌‌‌‌‌‌ అసానీ

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శుక్రవారం అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉందని చెప్పింది. అల్పపీడనం మార్చి 20 నాటికి బలహీనపడి తుపానుగా మారే చాన్స్ ఉందని, ఆ తర్వాత అది బంగ్లాదేశ్ – మయన్మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. తీరం దాటే సమయంలో అండమాన్ నికోబార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీవుల్లో 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తీరం దాటి తుపానుగా ఏర్పడితే ‘అసానీ’ అని శ్రీలంక సూచించిన పేరు పెడతారు. ఇక, అల్పపీడన ప్రభావంతో శనివారం నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. 2022లో మొదటి తుపాను ఇదే.