వారం రోజులు రాజస్థాన్‌ బోర్డర్స్‌ క్లోజ్‌

వారం రోజులు రాజస్థాన్‌ బోర్డర్స్‌ క్లోజ్‌
  • కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్ణయం
  • పాస్‌ ఉంటేనే అనుమతి

జైపూర్‌‌: రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాజస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు రాష్ట్ర బోర్డర్లను మూసేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. కేవలం పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని అధికారులు చెప్పారు. నాన్‌ అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్వోసీ) లేనివారిని రాష్ట్రంలోని అనుమతించేంది లేదని డైరెక్టర్‌‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎమ్‌.ఎల్‌. లాథర్‌‌ చెప్పారు. ఇంటర్‌‌ స్టేట్‌ ట్రావెల్‌పై బ్యాన్‌ విధిస్తున్నామని, ఈ మేరకు బోర్డర్‌‌లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అంతే కాకుండా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌‌పోర్ట్స్‌, రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్‌లలో కూడా చెక్‌పోస్ట్‌లు పెట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, సూపరింటెండెంట్‌ ఆఫ్ పోలీస్‌ పాస్‌లు ఇష్యూ చేస్తారని అన్నారు. అన్‌లాక్‌ 1 నిబంధనల కింద ఇంటర్‌‌ స్టేట్‌ ట్రావెలింగ్‌పై రాష్ట్రాలు నిర్ణయించుకోవాలని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో రాజస్థాన్‌లో టాప్‌ 5లో ఉంది. బుధవారానికి మొత్తం కేసులు 11,300కి చేరాయి. ఇప్పటి వరకు 256 మంది చనిపోయారు.