మళ్లీ మా కూటమే: పాశ్వాన్

మళ్లీ మా కూటమే: పాశ్వాన్

మోడీ, నేషనలిజం ఫ్యాక్టర్ల సాయంతో 2014 ఎన్ని-కల ఫలితాలను ఎన్డీయే మరోసారి రిపీట్ చేస్తుందనిలోక్ జన్ శక్తి పార్టీ (ఎల్ జేపీ) నేత, కేంద్ర మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ అన్నారు. ‘‘గత లోక్ సభ ఎన్నికల్లోమా దిరే ఈసారీ గెలుస్తామ ని భావిస్తు న్నా. మోడీనాయకత్వం లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం” అని చెప్పారు. ప్రతిపక్షం అనైక్యతకు గుర్తుగామారిం దని విమర్శించారు. బీహార్ లో ఇది స్పష్టం గాకనిపిస్తోందన్నారు. ఆదివారం పీటీఐ సంస్థకు ఇచ్చినఇంటర్వ్యూలో పాశ్వాన్ మాట్లాడారు. ఈనెల 11నతొలి దశ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి దశలో ఎన్డీయేకు అనుకూలత పెరుగుతోందని, ఇప్పుడది సునా మీగా మారిందని చెప్పారు.

‘‘ప్రతిదశలోనూ మాకు ఓట్లు పెరుగుతున్నాయి. మోడీ ఫ్యాక్టర్ పని చేస్తోంది. వారణాసి, జార్ఖండ్ లలో ఆయనరోడ్ షోలను చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. మాతో మరింతమంది చేతులు కలుపుతున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం తమలో తాము కొట్టుకుంటున్నాయి. అధికారంలోకి వస్తే ప్రతిపక్షాలు ఏం చేస్తాయో తెలియకుండా, ఆ పార్టీలకు ఓటెందుకు వేయాలని ప్రజలు తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు”అని చెప్పారు. 2014లో బీహార్ లో ఎన్డీయే కూటమి31 స్థానాల్లో గెలిచిం దని, ఈసారి 35 సీట్లకు పైనే గెలుస్తుందని పాశ్వాన్ ధీమా వ్యక్తం చేశారు.

‘‘ప్రస్తుత ఎన్నికల్లో టెర్రరిజం, నేషనలిజం వంటి అంశాలే సెంట్రల్ ఇష్యూస్. మోడీ చేసిన అభివృద్ధికి ప్రజలనుంచి పూర్తి మద్దతు లభించింది. సబ్సిడీపై ఫుడ్, ఎల్పీజీ సిలిండర్లు, టాయిలెట్లు, ఇళ్లు, ఆరోగ్య బీమాపథకాలను పెద్ద సంఖ్యలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పని చేస్తోంది. ఏన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల వల్ల ప్రజలు మాకు తోడుగా ఉంటున్నారు” అని వివరించారు. నిరుద్యోగం, ఎకానమీవంటి సమస్యలను పక్కదారి పట్టించేందుకే నేషనలిజం, పాకిస్థాన్ లోని టెర్రర్ క్యాంపులపై ఎయిర్ ఫోర్స్దాడులు తదితర అంశాలను బీజేపీ ప్రభుత్వం లేవనెత్తుతోందన్న విమర్శలను పాశ్వాన్ కొట్టిపారేశారు.‘ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్’ అన్నారు. ముస్లింల విషయంలో కాం గ్రెస్ కుటిల రాజకీయాలుచేయడం లేదా అని ప్రశ్నించారు. ‘‘మేం టెర్రరిస్టులను టార్గెట్ చేస్తాం. టెర్రరిస్టులు అంతం కావాలనిమేం అంటాం . కానీ కాంగ్రెస్ వాళ్లు ముస్లింల చెవుల్లో ఏం చెబుతారో తెలుసా? మేం ముస్లింలను అంతంచేయాలని అనుకుంటున్నట్లు చెబుతారు. ముస్లింలందరూ టెర్రరిస్టులని మేం అన్నట్లు ప్రాపగండా చేస్తారు” అని మండిపడ్డారు.

వాళ్ల ఓట్లూ మాకే
లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ కు యాదవులు సహా పలు సెక్షన్ల సాలిడ్ ఓటుబ్యాంకు ఉందని, ఇప్పుడు వారంతా ఎన్డీయే అభ్యర్థులకు సపోర్టు చేస్తున్నారని తెలిపారు. ‘‘బీహార్ లోయాదవ్ ల ఓటు బ్యాంకు కీలకం. వారు ప్రతిపక్ష కూటమిలోని వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ, హిందూస్థానీఆవామ్ మోర్చాలకు ఓటు వేయరు. ఎందుకంటే ఆపార్టీలు అంతబలంగా లేవు” అని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న పాశ్వాన్.. తన స్థానంలో తమ్ముడు పశుపతి కుమార్ ను హాజీపూర్నుంచి బరిలో నిలిపారు.