హైదరాబాద్, వెలుగు: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఈ సీజన్‌లో అరంగేట్రం చేయబోతున్న హైదరాబాద్ ఎఫ్‌సీ కో ఓనర్‌గా సినీనటుడు దగ్గుబాటి రానా కొత్తపాత్రలో మెరవనున్నాడు. హైదరాబాద్‌తో ఫుట్‌బాల్‌కు చాలా అనుబంధముందని, ఆ ఘన వారసత్వాన్ని అందుకునేందుకు ఐఎస్‌ఎల్ ఉపకరించగలదని రానా అన్నాడు. తొలి సీజన్‌లో హైదరాబాద్ టీమ్ తమదైన మార్కును వేయగలదని, చెన్నై, గోవాల్లో జరిగిన ప్రిలిమినరీ క్యాంపుల్లో టీమ్ సత్తాచాటిందని చెప్పాడు. ఇప్పటివరకు ఆడిన ఏడు ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో ఓటమన్నది ఎరుగకుండా ఆడిందని గుర్తుచేశాడు. మరోవైపు టీమ్ మేనేజ్‌మెంట్‌లోకి రానాను ప్రస్తుత ఓనర్లు త్రిపురనేని వరుణ్, మద్దూరి విజయ్ ఆహ్వానించారు.


