"రంగ రంగ వైభవంగా" రిలీజ్ డేట్ ప్రకటన

"రంగ రంగ వైభవంగా"  రిలీజ్ డేట్ ప్రకటన

డిఫరెంట్ కాన్సెప్టులతో తనదైన శైలిలో ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ని ఇంప్రెస్ చేస్తున్న వైష్ణవ్‌‌‌‌‌‌‌‌ తేజ్.. ఈసారి ఒక యూత్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వస్తున్నాడు. గిరీశాయ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో ‘రంగరంగ వైభవంగా’ మూవీ చేస్తున్నాడు వైష్ణవ్. కేతికాశర్మ హీరోయిన్‌‌‌‌‌‌‌‌. బీవీఎస్‌‌‌‌‌‌‌‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. నిజానికి ఈ సినిమాని జులై 1న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. నిన్న కొత్త రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ని ప్రకటించారు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తు న్నట్లు కన్‌‌‌‌‌‌‌‌ఫర్మ్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు స్టిల్స్ మిక్స్ అయి ఉన్నాయి. ఒకదానిలో వైష్ణవ్, కేతిక రొమాంటిక్‌‌‌‌‌‌‌‌ పోజులో ఉన్నారు. మరో దానిలో తన ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌‌‌‌‌తో సెల్ఫీ తీసుకుంటున్నాడు వైష్ణవ్. గతంలో రిలీజైన స్టిల్స్‌‌‌‌‌‌‌‌ని బట్టి వైష్ణవ్, కేతిక ఇద్దరూ డాక్టర్స్‌‌‌‌‌‌‌‌గా కనిపించ నున్నారు. నవీన్‌‌‌‌‌‌‌‌ చంద్ర, ప్రభు, నరేష్, ప్రగతి, తులసి, శ్రీలక్ష్మి తదిత రులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.