ఆర్టిస్టుల జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘రంగమార్తాండ’

ఆర్టిస్టుల జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘రంగమార్తాండ’

ఫ్యామిలీ ఎమోషన్స్, సోషల్‌‌ ఇష్యూస్‌‌తో సినిమాలు చేసే కృష్ణవంశీ.. ఈసారి థియేటర్ ఆర్టిస్టుల జీవితం ఆధారంగా ‘రంగమార్తాండ’ చిత్రం రూపొందించారు. ప్రకాష్​ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లీడ్ రోల్స్ చేస్తున్నారు.  ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మరాఠీ క్లాసిక్ మూవీ ‘నట సమ్రాట్‌‌’కి ఇది రీమేక్‌‌.  ఇటీవల చిరంజీవి వాయిస్‌‌ ఓవర్ ఇచ్చిన ఓ షాయరీని విడుదల చేసిన మేకర్స్, ఇప్పుడు ఒక్కొక్క లీడ్ యాక్టర్‌‌‌‌కి సంబంధించి పాత్రలను పరిచయం చేస్తున్నారు.

ఇందులో రాఘవరావు అనే థియేటర్‌‌‌‌ ఆర్టిస్ట్‌‌ క్యారెక్టర్‌‌‌‌లో ప్రకాష్​ రాజ్ కనిపించనున్నట్టు రీసెంట్‌‌గా రివీల్ చేశారు. గురువారం రాజుగారుగా రమ్యకృష్ణ పాత్రను పరిచయం చేశారు. ఇది మన అమ్మానాన్నల కథ అంటూ పోస్టర్స్, వీడియోస్‌‌పై రాసుండడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ ఇతరపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అతి త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.