V6 News

అంపైర్‌‌ను తిట్టిన శుభ్‌‌మన్‌‌ !

అంపైర్‌‌ను తిట్టిన శుభ్‌‌మన్‌‌ !

మొహాలీ: రైజింగ్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ వివాదంలో చిక్కుకున్నాడు. రంజీ మ్యాచ్‌‌లో అంపైర్‌‌ను దూషించి వార్తల్లో నిలిచాడు. శుక్రవారం ఢిల్లీతో మొదలైన ఈ మ్యాచ్‌‌లో పంజాబ్‌‌ తరఫున బ్యాటింగ్‌‌కు దిగిన గిల్‌‌ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సుబోధ్‌‌ బాటి బౌలింగ్‌‌లో క్యాచ్‌‌ ఔటయ్యాడు. దీంతో ఫీల్డ్‌‌ అంపైర్‌‌ మహ్మద్‌‌ రఫీ ఔటిచ్చినా..  క్రీజు వదలకుండా అలాగే ఉండిపోయాడు. తర్వాత అంపైర్‌‌ దగ్గరకు వెళ్లి ఏదో తిట్టినట్లు తెలిసింది. వెంటనే లెగ్‌‌ అంపైర్‌‌ పశ్చిమ్‌‌ పాథక్‌‌ దగ్గరకు వెళ్లి చర్చించిన రఫీ.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దీనిపై ఆందోళనకు దిగిన ఢిల్లీ ప్లేయర్లు మ్యాచ్‌‌ ఆడకుండా వెళ్లిపోయారు. 10 నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగింది. అయితే మ్యాచ్‌‌ రిఫరీ పి. రంగనాథన్‌‌ జోక్యం చేసుకోవడంతో ఆట తిరిగి ప్రారంభమైంది. 23 రన్స్‌‌ వద్ద సిమ్రాజిత్‌‌ బౌలింగ్‌‌లో అనూజ్‌‌ రావత్‌‌ క్యాచ్‌‌ పట్టడంతో గిల్‌‌ పెవిలియన్‌‌కు చేరాడు. ఈ మొత్తం ఎపిసోడ్‌‌పై రిఫరీ విచారణ జరిపించే చాన్స్‌‌ ఉందని సమాచారం.

Ranji Trophy: Shubman Gill 'abuses' umpire after being given out, decision overturned