ఇండియా హాకీ ప్లేయర్ వరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రేప్ కేసు

ఇండియా హాకీ ప్లేయర్ వరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రేప్ కేసు

బెంగళూరు/న్యూఢిల్లీ: ఇండియా హాకీ ప్లేయర్ వరుణ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  బెంగళూరులో రేప్ కేసు నమోదైంది.  తాను  మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నప్పుడు పలుమార్లు అత్యాచారం చేశాడంటూ  ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  ప్రస్తుతం 22 ఏండ్ల వయసున్న సదరు మహిళ పెండ్లి చేసుకుంటానని నమ్మించిన వరుణ్ గత ఐదేండ్లలో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది.

2019లో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్ ద్వారా తనతో పరిచయం అయినప్పుడు  తనకు 17 ఏండ్లు అని ఫిర్యాదులో తెలిపింది.  ఆ సమయంలో  బెంగళూరులోని సాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చినప్పుడు వరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిశానని వివరించింది. పెండ్లి చేసుకుంటానని చెప్పిన వరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తనతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడని పేర్కొన్నది. ఆమె  ఫిర్యాదు ఆధారంగా వరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పోక్సో చట్టంతో పాటు, 376 ( రేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), 420 (చీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సెక్షన్ల కింద ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు చేసినట్టు బెంగళూరు పోలీసులు తెలిపారు. 

ALSO READ:  జులైలో జింబాబ్వే టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టీమిండియా