వరంగల్ ‘మెడికవర్’ లో గుండెకు అరుదైన చికిత్స

 వరంగల్ ‘మెడికవర్’ లో గుండెకు అరుదైన చికిత్స

వరంగల్ సిటీ, వెలుగు: గుండె సమస్య కారణంగా తీవ్ర అలసట, శ్వాస ఇబ్బందులతో బాధపడుతున్న మహిళకు వరంగల్ మెడికవర్ హాస్పిటల్ లో వైద్యులు అత్యాధునిక చికిత్స నిర్వహించినట్లు ఆస్పత్రి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ సంతోష్ మోదాని వెల్లడించారు. హంటర్ రోడ్డులోని మెడికవర్ ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. 

వరంగల్​కు చెందిన 38 ఏండ్ల మహిళ గుండెలో సుమారు 3 సెం.మీ పరిమాణంలో ఉన్న ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ రంధ్రం ఉన్నట్లు వైద్యులు గుర్తించామన్నారు. అనంతరం అత్యాధునిక ఏఎస్టీ డివైజ్ క్లోజర్ విధానం ద్వారా ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలిపారు. ఏఎస్డీ డివైస్ క్లోజర్ విధానం ఓపెన్ హార్ట్ సర్జరీకి ఉత్తమ ప్రత్యామ్నాయమన్నారు. ఈ విధానంతో తక్కువ నొప్పి, తక్కువ రోజుల్లో కోలుకునే అవకాశం ఉంటుందని వివరించారు.