రస్నా గ్రూప్ వ్యవస్థాపకుడు అరీజ్ పిరోజ్‌షా కన్నుమూత

రస్నా  గ్రూప్ వ్యవస్థాపకుడు అరీజ్ పిరోజ్‌షా కన్నుమూత

రస్నా గ్రూప్ వ్యవస్థాపకుడు అరీజ్ పిరోజ్‌షా కంబట్టా (85) కన్నుమూశారు. ఈ విషయాన్ని రస్నా గ్రూప్ అధికారికంగా వెల్లడించింది. రస్నా ప్రపంచంలోనే అతిపెద్ద శీతల పానీయాల తయారీ సంస్థగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలలో రస్నా ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. సాప్ట్ డ్రింక్ రేట్లు పెరిగిన సమయంలోనూ కేవలం ఐదు రూపాయలకే రస్నా ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకువచ్చి అరీజ్ పిరోజ్‌షా కొత్త ట్రెండ్ క్రియెట్ చేశారు.  

ఐదు రూపాయ‌ల ర‌స్నా ప్యాకెట్ ద్వారా సుమారు 32 గ్లాసుల సాఫ్ట్ డ్రింక్‌ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. ఒక్కో గ్లాసుకు కేవలం 15 పైసలు మాత్రమే. 1980, 90 ద‌శ‌కాల్లో ఐ ల‌వ్ యూ ర‌స్నా యాడ్ ఎంతో ఫేమ‌స్‌ అయింది.  మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి అయిన రస్నాకు మంచి ఆదరణ లభించింది. పిరోజ్‌షా కంబట్టా బెనోవోలెంట్‌ ట్రస్ట్‌, రస్నా ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా, ప్రపంచ పార్సి ఇరానీ జొరాస్టిస్‌ మాజీ ఛైర్మన్‌గానూ వ్యవహరించారు.