- సర్కార్ స్కూల్‌కు నో అడ్మిషన్ బోర్డు
- ఎంట్రెన్స్ టెస్ట్ పెట్టి స్టూడెంట్ల ఎంపిక
- మూడు రోజుల్లోనే ముగిసిన అడ్మిషన్లు
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ జడ్పీ హైస్కూల్‌కు ‘నో అడ్మిషన్’ బోర్డు పడింది. ఈ స్కూల్‌లో అడ్మిషన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన మూడు రోజుల్లోనే అడ్మిషన్ల ప్రక్రియను ముగించి నో అడ్మిషన్ బోర్డును ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ స్కూల్‌లో 6, 8 తరగతులకు సంబంధించి మొత్తం 220 సీట్లకు ఇటీవల ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించగా.. 610 మంది స్టూడెంట్లు హాజరయ్యారు. పరీక్ష రాసిన విద్యార్థుల్లో ప్రతిభ చూపిన 236 మంది పేద విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. అడ్మిషన్ల కోసం ఇంకా ఒత్తిడి వస్తుండడంతో నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేసినట్లు హెచ్‌ఎం రాజ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ స్కూల్‌లో అన్ని తరగతుల్లో కలిపి మొత్తం 1238 మంది స్టూడెంట్లు ఉన్నట్లు హెచ్‌ఎం తెలిపారు.
