పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించేందుకు చట్టాలు అమలు చేస్తున్న ఆస్ట్రేలియా,యూకే, మలేషియా వంటి దేశాల బాటలోనే నడుస్తోంది యూఏఈ. 15 ఏళ్ళ లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది యూఏఈ. ఈ నిర్ణయం తీసుకున్న తొలి అరబ్ దేశంగా నిలిచింది యూఏఈ.
పిల్లల మానసిక ఆరోగ్యం, ఆన్‌లైన్ భద్రత, స్క్రీన్ టైం పై సోషల్ మీడియా ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న క్రమంలో నిర్ణయం తీసుకుంది యూఏఈ ప్రభుత్వం. పిల్లలు హానికరమైన కంటెంట్, సైబర్‌బుల్లింగ్, వ్యసనపూరిత ఆన్‌లైన్ ప్రవర్తనకు సులభంగా లోనవుతారని.. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఏజ్ లిమిట్ విధించడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
15 ఏళ్ళ లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. వచ్చే ఏడాది ప్రారంభంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపాదిత ఆంక్షలు, మైనర్ల కోసం ఆన్‌లైన్ రక్షణను బలోపేతం చేసే దిశగా అడుగులేస్తోంది యూఏఈ. గతేడాది 16 ఏళ్ళ లోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలు లేకుండా నిషేధిస్తూ ఆస్ట్రేలియా తరహా చట్టాన్ని యూకే కూడా అమల్లోకి తెచ్చింది.
ALSO READ : ఫోన్‌పే యూజర్లకు షాక్
16 ఏళ్ళ లోపు పిల్లలు తమ యాప్స్ వాడకుండా ప్లాట్ ఫామ్స్ చర్యలు తీసుకోవాలని... లేదంటే కోట్లాది డాలర్ల జరిమానా విధిస్తామని తెలిపింది బ్రిటన్. అయితే.. యూట్యూబ్ కిడ్స్, వాట్సాప్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్స్ కు ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చింది బ్రిటన్.
