డిజిటల్ పేమెంట్స్ అనగానే మన దేశంలో మెజారిటీ జనాలకు గుర్తొచ్చే పేరు 'ఫోన్‌పే'. టీ కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అంతా స్కాన్ చేసి పేమెంట్స్ చేస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు ఫోన్‌పే తన యూజర్లకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. మీ ఫోన్‌పే అకౌంట్‌లో వాలెట్ ఫీచర్ ఉండి, దాన్ని మీరు పట్టించుకోకుండా వదిలేస్తే.. మీ అకౌంట్ నుంచి పైసలు కట్ అవ్వడం ఖాయం. అవును ఇనాక్టివ్ వాలెట్లపై మెయింటెనెన్స్ ఛార్జీలు విధిస్తున్నట్లు కంపెనీ అలర్ట్ మెసేజ్ పంపడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.
అసలు మ్యాటర్ ఏంటంటే.. ఫోన్ పే యూజర్ వరుసగా 365 రోజుల పాటు వాలెట్‌ను ఒక్కసారి కూడా వాడకపోతే.. దాన్ని 'ఇనాక్టివ్ వాలెట్' కేటగిరీ కింద మారుస్తారు. అలా మారిన తర్వాత సదరు వాలెట్ మెయింటెనెన్స్ ఫీజు కింద ప్రతి మూడు నెలలకు రూ.100 చొప్పున వాలెట్ బ్యాలెన్స్ నుండి కట్ చేసుకుంటారు. ఈ బాదుడు కేవలం మీ వాలెట్‌లో డబ్బులు ఉంటేనే జరుగుతుంది. ఒకవేళ వాలెట్ ఖాళీగా ఉంటే మాత్రం ఎలాంటి మైనస్ బ్యాలెన్స్ పడదు. ఈ రూల్ పాతదే అయినప్పటికీ.. కంపెనీ ఇప్పుడు నోటిఫికేషన్లు పంపడంతో జనాలు అలెర్ట్ అయ్యారు.
⚠️ Seriously, what is this, PhonePe?
— Abhishek Yadav (@yabhishekhd) June 17, 2026
PhonePe has started warning users that inactive wallets will be charged ₹100 every quarter after 12 months of inactivity.
Most people don't even use PhonePe Wallet. They use UPI directly from their bank account and may not even know a… pic.twitter.com/SZHFcgASng
ప్రముఖ టెక్ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఎక్స్ అకౌంట్లో తనకు వచ్చిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ.. ‘సీరియస్‌గా, ఏంటిది ఫోన్‌పే?’ అంటూ ఫైర్ అయ్యారు. చాలా మంది అసలు వాలెట్ వాడరని, అందరూ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి యూపీఐ ట్రాన్సాక్షన్లు చేస్తారని గుర్తుచేశారు. పైగా ఇప్పుడు ఆ వాలెట్‌ను పర్మనెంట్‌గా క్లోజ్ చేద్దామంటే.. ‘ఫుల్ కేవైసీ’ పూర్తి చేయాలంటూ కండిషన్లు పెట్టడంపై యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
►ALSO READ | మోడీ సర్కార్ దెబ్బకు 65 శాతం తగ్గిన గోల్డ్ దిగుమతులు.. ఆందోళనలో చిన్న వ్యాపారులు
అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ పెనాల్టీ కేవలం ‘ఫోన్‌పే వాలెట్’ బ్యాలెన్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ నుండి జరిగే రెగ్యులర్ యూపీఐ లావాదేవీలకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి మీ యూపీఐ అకౌంట్లు సేఫ్. దీంతో చాలా మంది ఎక్స్ యూజర్లు వాటెల్ వాడే వ్యక్తులు ఏమైనా అందులో బ్యాలెన్స్ ఉంచితే వెంటనే దానిని ఖాళీ చేసుకోండి అంటూ సలహాలు ఇస్తున్నారు. మొత్తం మీద ఫ్రీ అనుకున్న సర్వీసులకు ఇలా ఛార్జీలు బాదడంపై డిజిటల్ ఇండియా జనాలు గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు.
