రామారావు ఆన్‌‌‌‌ డ్యూటీ టైమ్ ఫిక్స్

రామారావు  ఆన్‌‌‌‌  డ్యూటీ టైమ్ ఫిక్స్

‘ఖిలాడీ’ తర్వాత రవితేజ నుంచి వస్తున్న మరో కమర్షియల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘రామారావు ఆన్‌‌‌‌ డ్యూటీ’. ఈ చిత్రంతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రవితేజకు చెందిన ఆర్‌‌‌‌‌‌‌‌.టి. టీమ్‌‌‌‌ వర్క్స్‌‌‌‌తో కలిసి సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్‌‌‌‌ 17న థియేటర్స్‌‌‌‌లో విడుదల చేస్తున్నట్టు నిన్న ప్రకటించారు. నిజానికి మార్చి 25న లేదా ఏప్రిల్‌‌‌‌ 15న రిలీజ్ చేస్తామని గతంలో చెప్పారు. అయితే మొదటి డేట్‌‌‌‌కి ‘ఆర్ఆర్ఆర్’ వస్తోంది. ఏప్రిల్‌‌‌‌, మే నెలల్లో కూడా వరుస సినిమాలు రిలీజ్ కానుండటంతో తమ డేట్‌‌‌‌ని జూన్‌‌‌‌కి మార్చారు. రవితేజ డిప్యూటీ కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇసుక మాఫియా లాంటి అంశాల్ని టచ్ చేసినట్టు టీజర్‌‌‌‌‌‌‌‌లో చూపించారు. దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్ హీరోయిన్స్‌‌‌‌. వేణు తొట్టింపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, మధుసూదన్ రావు, సురేఖా వాణి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు.