అప్పిచ్చే యాప్స్‌తో జర జాగ్రత్త

అప్పిచ్చే యాప్స్‌తో జర జాగ్రత్త
అప్పు ఆఫరిచ్చే యాప్స్‌‌తో.. జాగ్రత్త ఆర్‌‌‌‌బీఐ హెచ్చరిక కేవైసీ డాక్యుమెంట్లు షేర్ చేయొద్దు ముంబై: అనధికారిక డిజిటల్ లెండింగ్ యాప్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌‌‌‌బీఐ) హెచ్చరిస్తోంది. డబ్బుల రికవరీ విషయంలో లెండింగ్ యాప్స్ వ్యవహరిస్తోన్న తీరు, అధికంగా విధిస్తోన్న వడ్డీ రేట్ల విషయంలో ఇటీవల ఆందోళనలు పెరిగాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్లిక్ చేసిన వెంటనే లోన్స్ ఇస్తామని చెబుతూ ఈ డిజిటల్ లెండింగ్ యాప్స్ ప్రజలకు ఎరవేస్తున్నాయి. లోన్స్ జారీ చేసిన తర్వాత ఈఎంఐ పేమెంట్లు, వడ్డీరేట్ల విషయంలో ప్రజలను నానా తిప్పలు పెడుతున్నాయని రిపోర్ట్‌‌లు వచ్చినట్టు ఆర్‌‌‌‌బీఐ చెప్పింది. బారోవర్స్‌‌కు చెందిన మొబైల్ ఫోన్స్ డేటాను ఇవి దుర్వినియోగపరుస్తున్నాయని కూడా ఆర్‌‌‌‌బీఐ తెలిపింది. గుర్తుతెలియని వ్యక్తులకు, వెరిఫై కాని, అనధికారిక యాప్స్‌‌కు కేవైసీ డాక్యుమెంట్లు షేర్ చేసుకోవద్దని కూడా ఆర్‌‌‌‌బీఐ హెచ్చరిస్తోంది. ఇలాంటి యాప్స్ ఏమైనా మీ దృష్టికి వస్తే సంబంధిత ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ ఏజెన్సీలకు వెంటనే రిపోర్ట్ చేయాలని చెప్పింది. అదేవిధంగా ఆన్‌‌లైన్‌‌లో https://sachet.rbi.org.in పోర్టల్‌‌లో కూడా మీ రిపోర్ట్‌‌ను ఫైల్ చేయొచ్చని పేర్కొంది. యాప్ ఆధారిత యాప్స్‌‌పై ఈ ఆరు నెలల కాలంలో ఆర్‌‌‌‌బీఐ తీసుకున్న రెండో చర్య ఇది. బ్యాంక్‌‌లు, నాన్ బ్యాంక్ ఫైనాన్షియర్లు తమ సొంత డిజిటల్ లెండింగ్ ప్లాట్‌‌ఫామ్ లేదా అవుట్‌‌సోర్స్‌‌డ్ సంస్థ ద్వారా అప్పులు ఇవ్వాలనుకుంటే తప్పనిసరిగా గైడ్‌‌లైన్స్ పాటించాల్సిందేనని చెప్పింది. అనధికారిక యాప్స్ విషయంలో కూడా బ్యాంక్‌‌లు, నాన్‌‌ బ్యాంక్‌‌లు కాస్త జాగ్రత్త వహించాలని పేర్కొంది. బారోవర్స్‌‌కు లోన్స్ ఇస్తోన్న యాప్స్ చాలా వరకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల కింద రిజిస్టర్ చేసుకోవడం లేదు. కానీ పలు రాష్ట్ర ప్రభుత్వాల మనీ లెండింగ్ యాక్ట్స్ కింద రిజిస్టర్ అయి, బారోవర్స్‌‌కు లోన్స్ ఇస్తున్నాయి. లోన్లు ఇచ్చిన తర్వాత వాటి అసలు స్వరూపం బయటికి తీస్తున్నాయి. బ్యాంక్‌‌లు, ఎన్‌‌బీఎఫ్‌‌సీల తరఫున డిజిటల్ లెండింగ్ ప్లాట్‌‌ఫామ్స్ తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని ఆర్‌‌‌‌బీఐ చెప్పింది. For More News.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కొంతే.. చేయాల్సింది ఎంతో బీజేపీ అధికారంలోకి వస్తే జూరాల లిఫ్ట్ కట్టి తీరుతం ప్రమోషన్లపై ఏపీ, తెలంగాణాలకు హైకోర్టు ఆదేశం