SRH vs RCB: మొదటి మ్యాచులోనే టఫ్ ఫైట్.. వాతావరణ సూచనలు, పిచ్ రిపోర్ట్పై బిగ్ అప్డేట్

SRH vs RCB: మొదటి మ్యాచులోనే టఫ్ ఫైట్.. వాతావరణ సూచనలు, పిచ్ రిపోర్ట్పై బిగ్ అప్డేట్

SRHvs RCB: ఐపీఎల్–19వ సీజన్ మరీ కాసేపట్లో ప్రారంభమవుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. గత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ ఈసారి కూడా టైటిల్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుంది. ఈ సీజన్ లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ నాయకత్వం వహించనున్నాడు. ఇక బెంగళూరు జట్టు బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్,  వెంకటేష్ అయ్యర్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా వరకు బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడి బరిలోకి దిగుతోంది. గతంలో లక్నోపై కేవలం 30 బంతుల్లో 100 భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జోడీ పవర్‌ప్లేలో ప్రమాదకరంగా మారగలదు. ఇషాన్ కిషన్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉండటం కూడా ఆ జట్టుకు అదనపు బలం. ఈ బ్యాట్స్‌మెన్‌లు ప్రారంభంలోనే దాడి చేసి ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తీసుకురావడం SRHకు ప్రధాన ఆయుధంగా మారనుంది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ప్యాట్ కమిన్స్ గాయంతో అందుబాటులో లేకపోవడంతో ఇషాన్ కిషన్ తాత్కాలిక నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇరు జట్లలో నాయకత్వ మార్పులు మ్యాచ్‌కు ఆసక్తికరమైన అంశంగా మారింది. 

పిచ్ రిపోర్టు: 
చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పిచ్ ప్లాట్ గా ఉండటం, చిన్న బౌండరీలు ఉండటం వల్ల భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సాధారణంగా ఇక్కడ జట్లు 180 నుంచి 200 పరుగుల మధ్య స్కోర్లు నమోదు చేస్తాయి. ఈ గ్రౌండ్ లో అవుట్‌ఫీల్డ్ కూడా పరుగుల వేగాన్ని పెంచుతుంది. కొత్త బంతితో పేస్ బౌలర్లకు కొద్దిగా స్వింగ్ లభించినా, మొత్తం మీద పిచ్ బౌలర్లకు పెద్దగా ఎలాంటి సహకారం లభించదు. స్పిన్నర్లను బ్యాట్స్‌మెన్ దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

వెదర్ రిపోర్టు: 
వాతావరణ నివేదిక ప్రకారం.. మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 24 నుంచి 28 డిగ్రీల మధ్య ఉండనున్నాయి. తేమ సుమారు 60 శాతం వరకు ఉండొచ్చు. వర్షం పడే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. 

ఇరు జట్ల అంచనా: 

ఆర్సీబీ: 
విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా.

ALSO READ : ఎస్ఆర్హెచ్ ఈ తప్పులని సరి చేసుకోవాల్సిందే.. లేకపోతే ఫస్ట్ మ్యాచ్ అస్సామే!

ఎస్ఆర్హెచ్:
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, హైన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్, కమిందు మెండిస్, బ్రైడన్ కార్స్, హర్షల్ పటేల్, జీషాన్ అన్సారీ.