IPL 2026: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ గ్రాండ్‌గా మొదలైంది. చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న ఈ తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మొదట ఫీల్డింగ్ తీసుకున్నాడు. దీంతో ఆరెంజ్ ఆర్మీ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. మేము మొదట బౌలింగ్ చేస్తాం.. జట్టులో ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉన్నారు, ఈ మ్యాచ్ కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.. ఈ సీజన్‌లో మా జెర్సీపై రెండో స్టార్ (రెండో సారి టైటిల్ గెలవడం) వేసుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.
ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ఇది కొత్త వికెట్ లాగా కనిపిస్తోంది.. మొదట బ్యాటింగ్ చేసినా లేదా బౌలింగ్ చేసినా పెద్దగా తేడా ఉండదు.. కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు, మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే చాలు.. మా ఆటగాళ్లందరూ మంచి టచ్‌లో ఉన్నారని తెలపారు. చిన్నస్వామి స్టేడియంలో చేజింగ్ చేయడం ఎప్పుడూ సులభం కాబట్టి, టాస్ గెలిచిన ఆర్సీబీ తెలివైన నిర్ణయమే తీసుకుంది. అయితే, పవర్ హిట్టర్లతో కూడిన హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించాలని భావిస్తోంది.
►ALSO READ | IPL 2026: భారత మీడియాపై విరుచుకుపడిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్
ఇరు జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్/వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ
🚨 Toss 🚨@RCBTweets won the toss and elected to field first.
— IndianPremierLeague (@IPL) March 28, 2026
Updates ▶️ https://t.co/Eo5z0jh4K4 #TATAIPL | #KhelBindaas | #RCBvSRH pic.twitter.com/EUyiubZlwy
