IPL 2026: భారత మీడియాపై విరుచుకుపడిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్

IPL 2026: భారత మీడియాపై విరుచుకుపడిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 గ్రాంఢ్ గా ప్రారంభమైంది. ఈ లీగ్ తొలి మ్యాచ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడుతున్నాయి. ఈ టోర్నీకి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్, ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ భారత మీడియాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఇండియన్ మీడియాపై ఫైర్ అయ్యాడు. తాను ప్రీ-సీజన్ శిక్షణా శిబిరానికి హాజరు కాకపోవడానికి కారణాలు తెలియజేస్తూ.. ఢిల్లీ ఫ్రాంచైజీకి, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.
 
ఐపీఎల్ 2026 ప్రీ-సీజన్ శిక్షణా శిబిరానికి మిచెల్ స్టార్క్ హాజరు కాలేదు.. ఈ గైర్హాజరు వెనుక కారణాలపై గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. క్రికెట్ ఆస్ట్రేలియా అతనికి NOC ఇవ్వలేదని కొందరు ప్రచారం చేయగా.. వర్క్ లోడ్ కారణంగా ఐపీఎల్ ఆడకూడదనే కండీషన్ పెట్టిందని వార్త కథనాలను ప్రచురించాయి కొన్ని మీడియా సంస్థలు. అయితే ఆసీస్ పేసర్ స్టార్క్ స్వయంగా ఈ ఊహాగానాలపై సమాధానం తెలియజేశాడు. 

►ALSO READ | IPL 2026: ఫస్ట్ మ్యాచ్లోనే ఆ హిస్టరీపై కన్నేసిన కోహ్లీ.. జస్ట్ 6,6,6,6,6,6,6,6,6 కొడితే చాలు

ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. తనకు భుజం, మోచేతి గాయాలు ఉన్నాయి, వాటి తీవ్రతను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నట్లు తెలిపారు. ఇండియన్ మీడియాలోని కొన్ని వర్గాలకు నా శరీరం గురించి నా కంటే ఎక్కువ తెలిసినట్లు ప్రచారం చేస్తున్నారంటూ సెటైర్లు వేశాడు. నేను ప్రస్తుతం రిహాబ్ సెంటర్లో ఉన్నా.. ఈ గాయం ఢిల్లీ జట్టుకు అభిమానులకు అసౌకర్యం కలిగించి ఉండొచ్చు.. అందుకు నేను క్షమాపణ చెబుతున్నానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ తో నిరంతరం టచ్ లోనే ఉన్నాను.. వీలైనంత త్వరగా టీమ్ లో చేరేందుకు ప్రయత్నిస్తానని మిచెల్ హామీ ఇచ్చాడు.

కాగా, ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ ని ఏప్రిల్ 1వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడబోతుంది. ఈ మ్యాచ్ సమయానికి మిచెల్ స్టార్క్ లేని లోటు జట్టుకు పెద్ద సవాలుగా మారే అవకాశం కనిపిస్తుంది. కైల్ జేమీసన్, లుంగి ఎంగిడి, దుష్మంత చమీరా లాంటి విదేశీ పేస్ బౌలింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. స్టార్క్ లేని లోటు భర్తీ చేయలేనిదని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ పేర్కొనింది.