హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. దీనిపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనన చేశారు. ఇవాళ అసెం బ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి.. ఈ ఏకగ్రీవ తీర్మానానికి సభ్యులంతా ఆమోదం తెల పాలని కోరారు. అధికార పక్ష సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... హైదరాబాద్ మెట్రో ఫేజ్ -1 69 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తయి ఎల్ అండ్ టీ, హెఎంఆర్ ఎల్ ఆధ్వర్యంలో నిర్వహస్తున్నారని చెప్పారు. దాని నిర్వహణ బాధ్యతను ఇకపై ప్రభు త్వమే చూసుకుంటుందని అన్నారు.
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ మెట్రో నెట్ వర్క్ విస్తరించాలన్న వివిధ వర్గాల నుంచి వచ్చిన డిమండ్ దృష్ట్యా విస్తరణకు నిర్ణయం తీసుకున్నట్టు సీఎం చెప్పారు. మెట్రో ఫేజ్ 2ఏ ప్రాజెక్టులో 76.4కి.మీ. ఫేజ్ 2బీ కింద 86.1 కి.మీ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉంద న్నారు. ఇందుకోసం కేంద్రానికి పంపిన ప్రతిపాదనలను ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
మెట్రో విస్తరణకు ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగానే స్వాధీన ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ప్రజా రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగు పరిచి, నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కా వలసిన ప్రణాళికలను రచించామన్నారు. అనంతరం మెట్రో స్వాధీనాన్ని సభ ఏక గ్రీవంగా ఆమోదించింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత, మాజీ మంత్రి హరీష్ రావు నిరసన తెలిపారు. ఇది ఏకగ్రీవ తీర్మానం కాదని, ఏకపక్ష తీర్మానమన్నారు.
బీఆర్ఎస్ సభ్యుల అభిప్రాయం తీసుకోకాకుండా ఏకగ్రీవంగా బిల్లును ఎలా పాస్ చేస్తారని ప్రశ్నించారు. శాసనసభ నడిపే పద్ధతి ఇది కాదంటూ ఫైర్ అయ్యారు. ప్రకటన చేసే హక్కు ఉంది కానీ.. దానిపై ఎలాంటి చర్చ జరపకుండా సభ్యులంతా ఆమోదించినం దుకు ధన్యవాదాలు అని ఎలా చెప్తారని పై రయ్యారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర నిరసన తెలుపుతున్నారన్నారు.
