అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీమ్‌.. ఒక రోజు ఉప్మా.. మరో రోజు కిచిడీ మిక్స్‌.. ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీమ్‌.. ఒక రోజు ఉప్మా.. మరో రోజు కిచిడీ మిక్స్‌.. ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్: అంగన్వాడీ చిన్నారులకు సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీమ్‌ ప్రారంభించారు. అంగన్వాడీ చిన్నారులకు ఇక నుంచి ఉప్మా, కిచిడీ మిక్స్‌ను బ్రేక్‌ ఫాస్ట్‌గా ప్రభుత్వం అందించనుంది. అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్‌ ఫోన్లను సీఎం పంపిణీ చేశారు.

అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం గురుతర బాధ్యత పెట్టిందని, చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకుని వారికి పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సీఎం రేవంత్‌ సూచించారు. అంగన్‌‌‌‌వాడీల్లో ఇప్పటికే మధ్యాహ్న భోజనం, గుడ్లు, బాలామృతం అందిస్తున్నారు.

►ALSO READ | బీఆర్ఎస్ పాలనలో మైనింగ్ మాఫియాపై సీఐడీ విచారణ : అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన

కొత్తగా ప్రవేశపెట్టిన బ్రేక్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌లో నాణ్యత తగ్గకుండా టీజీ ఫుడ్స్ ద్వారా రెడీ టు ఈట్ పద్ధతిలో ఆహారాన్ని అందించనున్నారు. పిల్లలకు నచ్చేలా, ఆరోగ్యాన్నిచ్చేలా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు మెనూ ప్లాన్ చేశారు. ఒక రోజు పిల్లలకు కిచిడీ బ్రేక్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌గా పెడితే, మరో రోజు ఉప్మా  అందించనున్నారు.

ఇలా రోజు విడిచి రోజు వేర్వేరు టిఫిన్స్‌‌‌‌ను చిన్నారులకు పెట్టనున్నారు. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించడంతోపాటు సెంటర్లలో అటెండెన్స్ పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.