సంగారెడ్డి టౌన్, వెలుగు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించిన బీజేపీ నేతల వైఖరికి నిరసనగా సోమవారం సంగారెడ్డిలో కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గంగేరి శ్రీహరి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ఐబీ నుంచి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వరకు కొనసాగింది. అనంతరం క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న పూలే, జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉత్తరాఖండ్‌లో మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను మరుసటి రోజు 'శుద్ధీకరణ' పేరుతో గంగాజలంతో శుభ్రం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. అబ్జర్వర్ దీపక్ రాథోడ్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నేరెళ్ల శారద, లైబ్రరీ సంస్థ చైర్మన్ రియాజ్ , దుద్దిళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
