మక్తల్, వెలుగు: ఈ నెల 20న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నారాయణపేట్ జిల్లా మక్తల్‌లో పర్యటించనున్నారు. సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి ఏర్పాట్లను పరిశీలించారు.
సభా ప్రాంగణం, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు గుండెపోటుతో చనిపోయిన పట్టణానికి చెందిన సురేశ్‌గుప్త అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
