హైదరాబాద్: మైనింగ్ అక్రమాలపై విచారణకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. రాఘవ కన్ స్ట్రక్షన్ రూల్స్ ప్రకారం వ్యవహరించిందని, వివాదం లేవనెత్తాలని బీఆర్ఎస్ చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మండిపడ్డారు.
మంత్రిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, బ్లాక్ మెయిల్కు ఈ ప్రభుత్వం భయపడదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీ బ్లాక్ మెయిల్ ఇంకో ప్రభుత్వం దగ్గర చేసుకోండని బీఆర్ఎస్ వైఖరిపై సీఎం తీవ్రంగా స్పందించారు.
రాఘవ కన్ స్ట్రక్షన్ కు తాము నోటీసులు ఇచ్చామని, బకాయిలను వసూలు చేసేందుకు నోటీసులు ఇచ్చామని సీఎం రేవంత్ చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కొత్తగా కనిపెట్టిన అంశం కాదని సీఎం స్పష్టం చేశారు. ప్రతి రూపాయి ఖజానాకు చేరాలని నోటీసులు ఇచ్చామని సీఎం తెలిపారు. నేరెళ్ల ఇసుక మాఫియాపై కూడా విచారణ చేస్తామని, మిడ్ వెస్ట్ గ్రనైడ్ ఇల్లీగల్ మైనింగ్ పై కూడా విచారణ చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు.
►ALSO READ | మైనింగ్పై అసెంబ్లీలో హాట్ హాట్ డిస్కషన్.. పొంగులేటి రాజీనామా చేయాలన్న హరీష్
శ్వేతా గ్రనైడ్ కు సంబంధించి ఇల్లీగల్ మైనింగ్ పై విచారణ చేస్తామని, గాయిత్రీ గ్రనైడ్స్ కి సంబంధించిన అవినీతిపై కూడా విచారణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఈ అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ పాలనలో ఇసుక మాఫియా ఏ స్థాయిలో జరిగిందో, ఏ స్థాయిలో మైనింగ్ దోపిడీ జరిగిందో సీఐడీ విచారణలో బట్టబయలు అవుతుందని.. సభలో ప్రకటించిన కంపెనీలపై విచారణ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
