మైనింగ్పై అసెంబ్లీలో హాట్ హాట్ డిస్కషన్.. పొంగులేటి రాజీనామా చేయాలన్న హరీష్

మైనింగ్పై అసెంబ్లీలో హాట్ హాట్ డిస్కషన్.. పొంగులేటి రాజీనామా చేయాలన్న హరీష్

హైదరాబాద్: పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలని.. ఆయనకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్పై అక్రమాలకు పాల్పడినందుకు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. రాఘవ కన్ స్ట్రక్షన్పై ఎందుకు చర్యలు తీసుకోరని, ప్రతిపక్ష నేతలు ఏదైనా తప్పు చేస్తే వెంటనే జైలులో పెడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు.

అధికార పక్షానికి ఒక రూల్.. ప్రతిపక్షానికి ఒక రూల్ ఏంటని నిలదీశారు. హరీష్ రావు లేవనెత్తిన ఈ డిమాండ్పై కాంగ్రెస్ మంత్రులు మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలన్న వ్యాఖ్యలను హరీష్ రావు వెనక్కి తీసుకోవాలని మంత్రులు డిమాండ్ చేశారు.

హరీష్ రావు అందుకు ససేమిరా అనడంతో.. హరీష్ రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. అక్రమ మైనింగ్పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. స్పీకర్ పోడియం ముందు బీఆర్ఎస్ సభ్యులు ధర్నాకు దిగారు. హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. 

►ALSO READ | నేరెళ్ల ఇసుక మాఫియా గుర్తుందా కేటీఆర్.. దళిత యువకులను చిత్రహింసలు పెట్టింది మర్చిపోయావా : మంత్రి వాకిటి 

బీఆర్ఎస్ వైఖరిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. స్వీపింగ్ రిమార్క్ చేసే అధికారం హరీశ్ కు లేదని, మంత్రి పొంగులేటి పేరు ఎలా ప్రస్తావిస్తారని మండిపడ్డారు. మంత్రి పొంగులేటిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని శ్రీధర్ బాబు చెప్పారు.