ఫూలే, అంబేద్కర్ జీవితాలు స్ఫూర్తిదాయకం : నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి

ఫూలే, అంబేద్కర్ జీవితాలు స్ఫూర్తిదాయకం : నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహానీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫూలే , అంబేద్కర్ విగ్రహాలను విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహనీయుల అడుగుజాడల్లో పయనిస్తూ సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలన్నారు. విప్ యెన్నం మాట్లాడుతూ పూలే, అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూపిన మార్గంలో ప్రతిఒక్కరూ నడవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ అనిత, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు. 

వంగూరు, వెలుగు: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. సోమవారం వంగూరు మండలంలోని రంగాపూర్ ప్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొత్త బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీవో రాజావర్ధన్ రావు, సర్పంచ్ క్యామ మల్లయ్య, సింగిల్ విండో చైర్మన్ సురేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, వైస్ చైర్మన్ బాలస్వామి, సీఈవో విష్ణు మూర్తి, తదితరులు పాల్గొన్నారు.