తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి : ఎంపీ డీకే అరుణ

తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి : ఎంపీ డీకే అరుణ

మక్తల్, వెలుగు: తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం సాయంత్రం మక్తల్ మండలం మంథన్ గోడ్ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ సమీపంలో ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోందన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో దోచుకుందని, ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు బలరాం రెడ్డి, వెంకట్రాములు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.