ప్రభుత్వ లెక్చరర్ల సమస్యలు పరిష్కరిస్తాం : ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి

ప్రభుత్వ లెక్చరర్ల సమస్యలు పరిష్కరిస్తాం : ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి
  • మంత్రి వాకిటి శ్రీహరి క్వార్టర్స్‌‌‌‌లో టీజీఎల్ఏ సమావేశం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్ల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌‌‌‌లోని పశుసంవర్థక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి క్వార్టర్స్‌‌‌‌లో తెలంగాణ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీఎల్ఏ) ప్రతినిధులు కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం 2023లో రెగ్యులరైజ్ అయిన అధ్యాపకుల ప్రొబేషన్ డిక్లరేషన్, వార్షిక ఇంక్రిమెంట్లు, ఇతర సర్వీస్ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వేం నరేందర్ రెడ్డిని సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌‌‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌ను ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. సమావేశంలో టీజీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు కుమార్, కోశాధికారి ఉపేందర్, రాష్ట్ర నాయకులు మోహన్, రామ్మోహన్, అనిల్ రెడ్డి, భాను, రవి తదితరులు పాల్గొన్నారు.