బెజ్జంకి: తహసీల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం

బెజ్జంకి: తహసీల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట  తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం

బెజ్జంకి, వెలుగు: తమ భూమికి సంబంధించి కోర్టులో వివాదంలో ఉండగా.. తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరొకరికి రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన దళిత మహిళ గాదే లక్ష్మి, ఆమె ఇద్దరు కూతుళ్లు ఆరోపించారు. సోమవారం తహసీల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. 

అక్కడ ఉన్న పోలీసులు, అధికారులు అప్రమత్తమై అడ్డుకున్నారు.. భూ సమస్య పరిష్కార అయేంతవరకు రిజిస్ట్రేషన్ చేయకూడదని ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కాగా ఆ సమయంలో తహసీల్దార్ అందుబాటులో లేరు.