గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు రెడీ అయ్యారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ రోజు ( మే 18న ) ఈ మూవీ ట్రైలర్ ను ముంబై వేదికగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
నిజమైన పహిల్వాన్లతో కుస్తీ..!
ట్రైలర్ లాంచ్‌లో చరణ్ తన చేతి గాయంపై షాకింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. "నా చేతికి గాయం.. దర్శకుడు బుచ్చిబాబు ఇచ్చిన అందమైన గిఫ్ట్ అంటూ చెప్పుకొచ్చారు. షూటింగ్‌లో ట్రైన్డ్ ఆర్టిస్టులను తీసుకురమ్మంటే, బుచ్చి నిజమైన పహిల్వాన్లను పట్టుకొచ్చాడు. యాక్షన్ అనగానే వాళ్ళు నన్ను ఒరిజినల్‌గా గట్టిగా పట్టేసుకున్నారు. దాంతో మణికట్టుకు గాయం అయింది అని తెలిపారు. ‘దంగల్’, ‘సుల్తాన్’ సినిమాలు మాకు ఇన్సిపిరేషన్. ఈ విషయంలో అమీర్, సల్మాన్ ఖాన్‌లకు థాంక్స్" అంటూ చరణ్ క్రేజీగా నవ్వేశారు. ఈ సినిమా కోసం చరణ్ ఏకంగా మూడుసార్లు గాయపడ్డారు.
నా లైబ్రరీలో ‘పెద్ది’..
ప్రతి మనిషి గుర్తింపు కోసం పోరాడతాడు, ‘పెద్ది’ కథ కూడా అదే. ఒక సాధారణ పల్లెటూరి కుర్రాడు ఢిల్లీకి వెళ్లి కూలీగా ఎందుకు మారాడు? క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా ఎలా హిస్టరీ క్రియేట్ చేశాడు? అనేదే సినిమా. నా కెరీర్‌లో మగధీర, రంగస్థలం, RRR లాంటి సినిమాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి. ‘పెద్ది’ కూడా నా లైబ్రరీలో అలాంటి ఒక రేర్ వండర్" అని చరణ్ నమ్మకంగా చెప్పారు.
చరణ్ వన్‌మెన్ షో!
ఒక పల్లెటూరి కుర్రాడు ఢిల్లీకి వెళ్లి కూలీగా ఎందుకు మారాడు? గుర్తింపు కోసం ఒక అథ్లెట్‌గా అతడు చేసిన పోరాటం ఏంటి? అనేదే 'పెద్ది' కథ. చరణ్ ఇందులో క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా మూడు డిఫరెంట్ షేడ్స్‌లో ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు. విచిత్రం ఏంటంటే.. ఈ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ సమయంలో చరణ్.. స్వామి మాలలో ఉంటూ కేవలం వెజిటేరియన్ డైట్‌తోనే ఈ ఫీట్ సాధించారని డైరెక్టర్ బుచ్చిబాబు అన్నారు. రామ్ చరణ్ లేకపోతే 'పెద్ది' లేదు అని చెప్పారు.
►ALSO READ | 'ప్రతీసారి మగావాడే తప్పు చేయడు'.. జయం రవికి మద్దతుగా ప్రియాంక చోప్రా కజిన్ మీరా చోప్రా!
రౌడీ డైరెక్టర్.
స్టేజ్ మీద జాన్వీ మాట్లాడుతూ... సినిమాలో నాకున్న యాటిట్యూడ్ అంతా బుచ్చిబాబు వల్లే వచ్చింది. ఆయనో రౌడీ డైరెక్టర్ అంటూ నవ్వులు పూయించింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ హైలైట్ కానుంది. కన్నడ శివరాజ్ కుమార్, దివ్యేందు, జగపతిబాబు లాంటి హేమాహేమీలు నటించారు. జూన్ 4న థియేటర్లలోకి వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.
