యాదాద్రి జిల్లాలో ఏడు ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రద్దు

యాదాద్రి జిల్లాలో ఏడు ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రద్దు

యాదాద్రి భువనగిరి జిల్లా :  నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులపై వైద్య ఆరోగ్య శాఖ కొరడా ఝులిపించింది. రూల్స్ కి విరుద్దంగా నడుపుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు. ఈ క్రమంలోనే సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఏడు ప్రవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లుగా  డిఎంహెచ్ఓ మల్లికార్జున రావు ప్రకటించారు. ఇక నుంచి రూల్స్ బ్రేక్ చేస్తే మిగతా హాస్పిటల్స్ కి  రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్లు రద్దయిన హాస్పిటల్స్ వివరాలు ఇవే.. 

  • సూర్య హాస్పిటల్, మాదాపూర్
  • శ్రీ పూజిత హాస్పిటల్, చౌటుప్పల్
  • శారదా నర్సింగ్ హోమ్, మోత్కుర్
  •  మాధవి నర్సింగ్ హోమ్, మోత్కుర్ 
  • తేజ్ నర్సింగ్ హోమ్, మోత్కుర్
  • శ్రీ స్వాతి నర్సింగ్ హోమ్, భువనగిరి
  • తేజస్విని నర్సింగ్ హోమ్, భువనగిరి