సమ్మర్ గిఫ్ట్​గా ‘రుద్రుడు’

సమ్మర్ గిఫ్ట్​గా ‘రుద్రుడు’

రాఘవ లారెన్స్ కొరియోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ట్ చేసి నటుడిగానూ సక్సెస్ అయ్యాడు. హీరోగా వరుస సినిమాలు చేస్తూ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తున్నాడు. హారర్, థ్రిల్లర్ మూవీస్‌‌‌‌‌‌‌‌కి కేరాఫ్ కూడా అయ్యాడు. ప్రస్తుతం ‘చంద్రముఖి’ సీక్వెల్‌‌‌‌‌‌‌‌తో పాటు మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు లారెన్స్. వాటిలో ‘రుద్రుడు’ ఒకటి. తమిళంలో ‘రుద్రన్’ టైటిల్‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కదిరేశన్ దర్శకుడు. ప్రియ భవానీ శంకర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది.

ఇందులో శరత్‌‌‌‌‌‌‌‌ కుమార్, పూర్ణిమా భాగ్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చాలాకాలం క్రితమే అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ప్లాన్ మారింది. ముందు చెప్పిన తేదీకి కాకుండా ఏప్రిల్ 14న సమ్మర్ గిఫ్ట్​గా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఫిక్సయ్యారు. వీఎఫ్ఎక్స్ వర్క్‌‌‌‌‌‌‌‌ ఆలస్యమవుతూ ఉండటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు దర్శక నిర్మాతలు చెప్పారు.