‘ఉపాధి’ పెండింగ్ వేతనాలు విడుదల

‘ఉపాధి’ పెండింగ్ వేతనాలు విడుదల

హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకం కూలీలు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ స్కీమ్‌‌కు సంబంధించిన వేతనాలు, అడ్మినిస్ట్రేషన్ ఖర్చుల కోసం భారీగా నిధులు విడుదల చేసింది.

మొత్తం రూ.518 కోట్ల నిధులు మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధి హామీ కూలీల వేతనాల కోసం ప్రభుత్వం రూ.440 కోట్లు కేటాయించింది. మరోవైపు ఉపాధి హామీ పథకం నిర్వహణ (అడ్మిన్) నిధుల కింద రూ.78 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కూలీలు, క్షేత్రస్థాయి సిబ్బందికి ఏప్రిల్ 15 వరకు రావాల్సిన బకాయిలను చెల్లిస్తారు.