హైదరాబాద్: ఐపీఎల్19లో వరుస విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా యంగ్ బౌలర్ శివం మావి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దీంతో శివం మావి స్థానంలో అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యుడు, యువ కెరటం ఆర్‌ఎస్ అంబరీష్ హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ శుక్రవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అఫిషియల్‌గా అనౌన్స్ చేసింది. గాయం కారణంగా టోర్నీకి దూరమైన శివం మావి స్థానంలో యువ ఆల్ రౌండర్ అండర్ ఆర్ఎస్ అంబరీష్ ఆరెంజ్ ఆర్మీలో చేరినట్లు ప్రకటించింది.
నయా హార్ధిక్ పాండ్యా..!
నయా హర్ధిక్ పాండ్యాగా గుర్తింపు పొందిన 18 ఏళ్ల ఆర్ఎస్ అంబరీష్ తమిళనాడుకు చెందిన యువ క్రికెటర్. పేస్ ఆల్‌రౌండరైన ఈ కుర్రాడు 2026 అండర్ 19 వరల్డ్ కప్ విజేత అయినా టీమిండియా జట్టులో సభ్యుడు. టీమిండియా అండర్ 19 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా బంతితో నిప్పులు చెరిగి టోర్నీలో 11 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో కూడా రాణించాడు.
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మాదిరిగా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటగలడు. హైదరాబాద్ కూడా ఇదే ఉద్దేశంతో అంబరీష్ ను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు బౌలర్‌గా, ఇటు లోయర్ ఆర్డర్‌లో బ్యాటర్‌గానూ పనికొస్తాడని స్వ్కాడ్‌లో చేర్చుకుంది. టీ20 వరల్డ్ కప్ లో అద్భుత పదర్శనతో జట్టులో టైటిల్ అందించిన అంబరీష్.. ఇప్పుడు ఐపీఎల్లో అరంగ్రేటానికి సిద్ధమయ్యాడు. ఐపీఎల్ ఆరంభాన్ని కూడా ఘనంగా చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
గెలుపు జోష్‌లో ఆరెంజ్ ఆర్మీ..!
టోర్నీని ఓటుములతో మొదలుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత బలంగా పుంజుకుంది. వరుస విజయాలతో సత్తా చాటుతోంది. ప్రస్తుతం 9 మ్యాచులు ఆడిన కాటేరమ్మ కొడుకులు ఆరు విజయాలు సాధించి మూడింట్లో ఓడిపోయారు. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆడబోయే మరో 5 లీగ్ మ్యాచుల్లో హైదరాబాద్ రెండు విజయాలు సాధిస్తే ఫ్లే ఆఫ్స్ చేరుకోనుంది.
ప్రస్తుతం హైదరాబాద్ ఆటగాళ్ల జోరు చూస్తుంటే ఎస్ఆర్ హెచ్ ఫ్లే ఆఫ్స్ కు వెళ్లడం దాదాపు ఖాయమే అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా లాస్ట్ మ్యాచులో పటిష్టమైన ముంబై జట్టును వాళ్ల సొంత గడ్డపైనే చిత్తు చేయడం కాటేరమ్మ కొడుకుల్లో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.
