బీట్ రూట్, క్యారెట్ జ్యూస్ ఇలా చేసుకొని తాగితే... ఏ రోగాలు రావు..!

బీట్ రూట్, క్యారెట్ జ్యూస్ ఇలా చేసుకొని తాగితే... ఏ రోగాలు రావు..!

వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇమ్యూనిటీని పెంచుకుంటే ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ మన దగ్గరకు రావు. బీట్ రూట్, క్యారెట్ జ్యూస్ తాగితే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. బీట్ రూట్ లో ఉండే విటమిన్-సి ఎర్ర రక్తకణాలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. దీంతో బాడీలో ఇన్ఫెక్షన్ రాదు. 

క్యారెట్ ఉండే విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూన్ సెల్స్ ను రక్షిస్తాయి. దాంట్లోని విటమిన్ బి6 వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటాం. జ్యూస్లో అల్లం వేసుకోవడం వల్ల అది ఇన్ఫెక్షన్స్ ను రానీయకుండా ఫైట్ చేస్తుంది.

తయారీ: 

  • ఒక్కో క్యారెట్, వీట్ రూట్లను కడిగి చెక్కుతీసి చిన్న ముక్కలుగా కోయాలి. 
  • జ్యూసర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. 
  • తర్వాత జ్యూసు గ్రాసులో పోసి, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా అల్లం తరుగు. కలిపితే క్యారెట్ బీట్ రూట్ జ్యూస్ రెడీ.