పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘ఐ నోబడీ’ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. తన భార్య, కూతురుతో సాధారణ జీవితం గడిపే రాజీవన్ అనే కామన్ మ్యాన్‌గా పృథ్వీరాజ్ కనిపించారు. అయితే ఓ బ్యాంకు దోపిడీ కేసులో అతను కీలక వ్యక్తిగా మారడంతో కథలో ట్విస్ట్ రివీల్ అయింది. ఆ తర్వాతి సీన్స్ చూస్తుంటే ఆ పరిస్థితుల్లో చిక్కుకున్న ఒక బాధితుడా లేక ఆ దోపిడీ వెనుక ఉన్న అసలైన సూత్రధారినా అనే అనుమానంతో టీజర్ ఆసక్తి రేపింది.
డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో డైలాగ్స్ కంటే తన కళ్లతో, బాడీ లాంగ్వేజ్‌తో పృథ్వీరాజ్ ఎక్కువ భావాలను పలికించారు. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ, జేక్స్ బిజోయ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇంప్రెస్ చేశాయి. పృథ్విరాజ్‌కు జంటగా పార్వతి తిరువోతు నటించింది.
నిసమ్ బషీర్ ఈ చిత్రానికి దర్శకుడు. జులైలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రంలో పృథ్వీరాజ్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
