జాబ్‌‌‌‌ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి

జాబ్‌‌‌‌ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి

ప్రజాపాలన  ప్రగతి  ప్రణాళిక  99 రోజుల  యాక్షన్ ప్లాన్ భాగంగా  రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాల్లో  ప్రత్యేక  కార్యాచరణ  తీసుకొని  ముందుకుపోతోంది. అందులో భాగంగా రాష్ట్ర  క్రీడలు,  యువజన సర్వీసులశాఖ ఆరు రోజులపాటు యాక్షన్ ప్లాన్​ను  సిద్ధం  చేసింది. మే 18  నుంచి 23 వరకు  రాష్ట్రవ్యాప్తంగా   ప్రత్యేక  కార్యక్రమాలను  నిర్వహించనుంది.  18న  మారథాన్  ఫిజికల్  లిటరసీ,  19న  కెరీర్  స్కిల్ డే,  20న యూత్ లీడర్ షిప్  సమ్మిట్,  21న  స్పోర్ట్స్ డే, 22న  యూత్ ఫర్ క్లీన్  తెలంగాణ  సర్వ్‌‌‌‌ అండ్ సపోర్ట్,  మే 23న ఉద్యోగ సాధన  కార్యక్రమాలను చేయాలని నిర్ణయించింది.  

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి  వాకిటి శ్రీహరి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ శ్రీధర్ బాబుల పర్యవేక్షణలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం  సంకల్పించింది.   తెలంగాణలోని ఉమ్మడి  పది జిల్లాల్లో  క్రీడలు యువజన శాఖ ఆధ్వర్యంలో  జాబ్ మేళాలు  నిర్వహించనున్నారు.  ఈ జాబ్ మేళాలు  మే 1 నుంచి  మే 12 వరకు జరగనున్నాయి. 

  • 20 వేల ఉద్యోగాల లక్ష్యం

మే 1న   మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌,  2న నల్గొండ, 4న ఖమ్మం, 5న కరీంనగర్,  6న పెద్దపల్లి, అదిలాబాద్,  7న నిజామాబాద్,  8న  సంగారెడ్డి,  వరంగల్,  11న రంగారెడ్డి, 12న హైదరాబాద్  జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తారు. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో  నిర్వహించబోయే ఈ జాబ్ మేళాలు  250 పైగా కంపెనీలు 20వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలను కల్పించడమే  లక్ష్యంగా నిర్వహించనున్నారు.  

జాబ్‌‌‌‌ మేళాకు వచ్చేవారు  ఇంటర్,  డిప్లొమా,  గ్రాడ్యుయేషన్,  పోస్ట్ గ్రాడ్యుయేషన్  అర్హత ఉండి అనుభవం ఉన్నవారు,  అదేవిధంగా  కొత్తవారు కూడా  తమ ప్రతిభకు అనుగుణంగా ఉద్యోగాలను ఎంచుకోవచ్చు.  జాబ్‌‌‌‌ మేళాకు  వచ్చేవారు రిజిస్టర్  చేసుకునేందుకు  ప్రత్యేక  మొబైల్  యాప్ ను,  ప్రత్యేక  వెబ్‌‌‌‌ పోర్టల్​ను క్రీడలు,  యువజన సర్వీసులశాఖ రూపొందించింది. 

ఈ జాబ్‌‌‌‌ మేళాకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు జిల్లాల క్రీడాశాఖ అధికారులు, యువజన శాఖ అధికారులను సంప్రదించవచ్చు.  ప్రజాపాలన  ప్రగతి ప్రణాళిక 99వ యాక్షన్ ప్లాన్​ను  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  ఈ కార్యక్రమం విజయవంతం కోసం ప్రతి ఒక్కరూ  భాగస్వాములు కావాలని విజ్ఞప్తి  చేస్తున్నాం.

  • - బండారు జితేందర్, పీఆర్వో
  • రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు మంత్రిత్వ శాఖ